Big Stories

Livall Pikaboost e-bike conversion kit : ఆ కిట్ తో మామూలు సైకిల్ ను ఇ-బైక్ గా మార్చొచ్చు

Livall Pikaboost e-bike conversion kit: ఒకప్పుడు సైకిల్ నడపడమంటే అదో సరదా. చాలామందికి అదే ప్రయాణ సాధనం కూడా. కానీ బైకుల జోరు పెరిగాక సైకిళ్ల వాడకం తగ్గింది. అదే టైంలో సైకిళ్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. గేర్ సైకిళ్లు కూడా వచ్చాయి. నాటి సైకిల్ తో పోల్చితే వీటిని తొక్కడంలో శ్రమ తక్కువ. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మామూలు సైకిల్ ను కూడా ఇ-బైక్ గా మార్చుకోవచ్చు. అందుకోసం ఒక కిట్ ను తయారు చేసింది అమెరికా కంపెనీ. ఆ కిట్ పేరు లివాల్ పికాబూస్ట్. ఈ కిట్ ను అమర్చితే క్షణాల్లో సంప్రదాయ సైకిల్ ఇ-బైక్ గా మారిపోతుంది. దీని ధర కూడా చాలా తక్కువే. పెద్దగా బరువు కూడా ఉండదు. జస్ట్ మూడు కిలోలు మాత్రమే ఉంటుంది. దీన్ని సంచిలో వేసుకుని వెళ్లొచ్చు.
లివాల్ పికాబూస్ట్ కిట్ ను అమర్చుకోవడం చాలా ఈజీ. సైకిల్ సీటు కింద అమర్చితే చాలు. ఈ కిట్ కు ఒక చివరన చిన్న వీల్ ఉంటుంది. ఇది సైకిల్ వెనుక టైరుకు ఆనుకుంటుంది. అంటే ఈ కిట్ వీల్ సైకిల్ టైరును వేగంగా ముందుకు నడిపిస్తుందన్న మాట. ఎందుకంటే పికాబూస్ట్ కిట్ లో 234 వాట్ల బ్యాటరీ ఉంటుంది. దీనివల్లనే కిట్ లోని వీల్ చాలా వేగంగా తిరుగుతుంది. అంటే సైకిల్ పై స్వారీ చేసే వ్యక్తి తొక్కనవసరం లేకుండా చేస్తుంది.
లివాల్ పికాబూస్ట్ కిట్ మూడు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణం చేయొచ్చు. ఇక సైకిల్ స్లోగా వెళ్లేలా బ్రేక్ పట్టుకున్నప్పుడు, రోడ్డు వాలుగా ఉన్నచోట ఆటోమేటిగ్గా బ్యాటరీ పవర్ సేవ్ అవుతుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా నో ప్రాబ్లం. ఛార్జింగ్ చేయడానికి కుదరకపోయినా టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఎంచక్కా తొక్కుకుంటూ సైకిల్ ని నడిపించొచ్చు.
ఈ కిట్ కు ఉన్న మరో సౌకర్యం ఏంటంటే… ఎక్కడైనా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే… ఈ కిట్ తో ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక యూఎస్బీ పోర్టు ఉంటుంది. ఇక సైకిల్ ని పక్కన పెట్టి లాక్ చేయడం మరిచిపోయినా ఎవరైనా ఎత్తుకుపోతారేమోననే భయం కూడా అక్కరలేదు. ఎందుకంటే ఆటోమేటిగ్గా లాక్ పడిపోతుంది. ఇక మామూలు సైకిల్ ని ఎలాగైతే రఫ్ అంట్ టఫ్ గా నీళ్లు, ఇసుక, బురదలో నడిపిస్తామో దీన్ని కూడా అలాగే నడిపించొచ్చు. వీటి వల్ల కిట్ కు ఎలాంటి ఢోకా ఉండదట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News