BigTV English

Liver Problems : ఇవి తింటే ఇక మీ లివర్‌ పని అంతే

Liver Problems : ఇవి తింటే ఇక మీ లివర్‌ పని అంతే

Liver Problems : మానవ శ‌రీరంలో లివర్‌ ఒక ప్రధాన అవయవం. కాలేయం అనేక ప‌నులు చేస్తుంది. తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శరీరం వినియోగించుకునేలా చేస్తుంది. అంతేకాకుండా శ‌రీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. కానీ మనం తినే కొన్ని ఆహారాల వల్ల లివ‌ర్ ఆరోగ్యం దెబ్బతింటోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లివర్‌ దెబ్బతినడానికి ముఖ్యకారణం మద్యం సేవించడం, అతిగా మద్యం సేవిస్తే కొంత కాలానికి లివ‌ర్ చెడిపోయి ప‌నిచేయ‌కుండా అవుతుంది. దీంతో ప్రాణాపాయంగా మారుతుంది. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం సేవించడం తగ్గించాలి. చ‌క్కెర అధికంగా ఉండే స్వీట్లను తిన్నా లివ‌ర్ పాడవుతుంది. దీని వ‌ల్ల లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. అందుకే ఈ ఆహారాల‌ను తక్కువ‌గా తీసుకోవాలి. ప్రస్తుతం అనేక మంది రుచి కోసం ఆహార పదార్థాల్లో టేస్టింగ్ సాల్ట్‌ను వాడుతుంటారు. ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్లు, బేక‌రీల్లో అనేక ప‌దార్థాల్లో దీన్ని కలుపుతారు. ఇది కాలేయంపై అధికంగా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా లివ‌ర్ వాపున‌కు గుర‌వుతుంది. అందుకే ఫాస్ట్‌ఫుడ్‌, బేకరీ ఫుడ్‌ను తినకుండా ఉంటే మంచిది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు, కంటి చూపునకు విట‌మిన్ ఎ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. అయితే విట‌మిన్ ఎ ను నిత్యం అవ‌స‌రానికంటే ఎక్కువగా తీసుకున్నా లివ‌ర్ స‌మ‌స్యలు వ‌స్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్‌ తాగినా లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. డిప్రెష‌న్‌కు మెడిసిన్ తీసుకునే వారిలో కూడా లివ‌ర్ జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఉప్పు ఎక్కువ‌గా తీసుకున్నా బీపీతో పాటు లివ‌ర్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నూనె ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తీసుకుంటే లివర్‌ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×