Big Stories

Mental Diseases : మానసిక వ్యాధులను కనిపెట్టడానికి కొత్త టెక్నిక్..

Mental Diseases : టెక్నాలజీ పెరిగింది. దీంతో పాటు అంతుచిక్కని వ్యాధుల సంఖ్య కూడా ఎక్కువవుతూ వస్తోంది. కానీ టెక్నాలజీ ఎంత పెరిగిన ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయి, వాటికి కారణం ఏంటి, వాటికి ఎలాంటి చికిత్స ఇస్తే మంచిది.. ఇలాంటి విషయాలు కనిపెట్టడం కష్టంగా మారింది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా వస్తున్న మానసిక వ్యాధులు చాలామందికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. దీనికోసమే శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నిక్‌ను కనిపెట్టారు.

- Advertisement -

న్యూరోజెనరేటివ్ వ్యాధులను కనిపెట్టడం కోసం శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నిక్‌తో ముందుకొచ్చారు. ఈ టెక్నిక్‌తో వ్యాధిని తొందరగా కనిపెట్టడంతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్తున్నారు. మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లో కూడా మానసిక సమస్యలను కనిపెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు చికిత్సను కనిపెట్టడం కోసం ఈ టెక్నిక్‌ను వినియోగించడం మంచిదని శాస్త్రవేత్తలు తెలిపారు.

- Advertisement -

ముందుగా ఈ పరిశోధనలు జింకలోని సీడబ్ల్యూడీపై ఫోకస్ చేయడంతో మొదలయ్యింది. కానీ మెల్లగా ఇది మనుషుల్లోని న్యూరోజెనరేటివ్ వ్యాధులకు చికిత్సను అందించే విధంగా మెరుగుపరచాలి అన్నదే శాస్త్రవేత్తల టార్గెట్. ముఖ్యంగా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులకు చికిత్సను కనుక్కోవాలనే ఉద్దేశ్యంతోనే పరిశోధనలు మొదలయ్యాయి. న్యూరోజెనరేటివ్ వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను తగ్గించాలని వారు ఈ అల్ట్రా సెన్సిటివ్ టెక్నాలజీని కనిపెట్టినట్టు తెలిపారు శాస్త్రవేత్తలు.

మామూలుగా న్యూరోజెనరేటివ్ వ్యాధులు అనేవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో ప్రొటీన్ లోపంతో మొదలవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ ప్రొటీన్స్‌ను గుర్తించడం వల్ల న్యూరోజెనరేటివ్ వ్యాధులు బయటపడతాయని శాస్త్రవేత్తల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. దానికోసమే వారు ఆర్టీ క్విక్ అనే పద్ధతిని కనిపెట్టారు. ఇది వ్యాధిని కనుక్కునే సమయంతో పాటు కచ్చితంగా వ్యాధి గురించి సమాచారం అందిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అనేది జంతువులపై పరీక్షించి చూస్తున్నారు. అయితే ఇదే ప్రక్రియ మనుషుల్లోని న్యూరోజెనరేటివ్ వ్యాధులను కూడా కనిపెట్టడంలో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ మనుషులపై దీనిని ప్రయోగించి చూడడానికి ఇంకా సమయం పడుతుందని వారు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News