BigTV English

Musk: వాళ్లకు పుల్.. వీళ్లకు నిల్..

Musk: వాళ్లకు పుల్.. వీళ్లకు నిల్..

Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా… ఆయన రూటే సెపరేట్ అన్నట్టు ఉంటుంది. తన చర్యలు, నిర్ణయాలతో ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయని మస్క్… అప్పుడప్పుడూ నెటిజన్లకు కౌంటర్లూ ఇస్తుంటారు. ఫ్రీగా విసిరేదే కదా! అని… విమర్శించే వారిపై ఓ రేంజులో పంచులు విసిరే మస్క్… ఇవ్వాల్సిన వాళ్లకు మాత్రం అస్సలు ఇవ్వకుండా మొండికేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలి? ఎందుకు మొండిగా ఉన్నాడు?


ఇప్పుడు మస్క్ మరో ఫిటింగ్ పెట్టాడు. తాను ట్విటర్‌ను కొనక ముందు ఉన్న అప్పులతో తనకు సంబంధం లేదంటున్నాడు. వాటిని చెల్లించేందుకు మస్క్‌ ససేమిరా అంటుండటంతో… డబ్బు రావాల్సిన వాళ్లు ఎలా రాబట్టుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. సంస్థకు చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణ ఖర్చులతో పాటు, వివిధ కాంట్రాక్ట్ సేవా సంస్థలకు ట్విట్టర్ నుంచి భారీగా బిల్లులు రావాల్సి ఉంది. కానీ… వాటి గురించి పాత యాజమాన్యం మస్క్‌కు ఏమీ చెప్పలేదు. దాంతో పాత బకాయిల్ని చెల్లించేందుకు మస్క్‌ నిరాకరిస్తున్నాడని… డబ్బు రావాల్సిన వాళ్లంతా అంతర్జాతీయ మీడియా ముందు వాపోతున్నారు. దాంతో.. మస్క్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇక ట్విటర్‌కు సంబంధించి మస్క్ నెటిజన్లకు పంచ్ మీద పంచ్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ట్విటర్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… అసలు ఈ సంస్థ మనుగడ సాధిస్తుందా? అని ప్రశ్నించిన వారికి మస్క్‌ గట్టి సమాధానం ఇచ్చాడు. అలా అనుకుంటే ట్విట్టర్ ఈపాటికే చచ్చిపోయి ఉండాలి కదా? అంటూ విమర్శకుల నోళ్లు మూయించాడు. ట్విటర్‌ భవిష్యత్తు ఇక కష్టమేనంటూ నెటిజన్లు చేస్తోన్న విమర్శలపై స్పందించిన మస్క్… ట్విట్టర్ పని ఇప్పటికే ఫినిష్ అయినట్లైతే, స్వర్గానికో నరకానికో వెళ్లేవాళ్లమేమో, తెలీదు మరి! అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు… మస్క్. దాంతో… ఇవ్వాల్సిన వాళ్లకి ఒక్క పైసా కూడా విదిల్చని మస్క్… పంచులు మాత్రం ఫ్రీగా ఇస్తున్నాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×