EPAPER

Twitter : భారత్‌లో మస్క్ బాదుడు షురూ..

Twitter : భారత్‌లో మస్క్ బాదుడు షురూ..

Twitter : బ్లూ టిక్ కు నెలకు 8 డాలర్లు వసూలు చేస్తామని ప్రకటించి… కొన్ని దేశాల్లో ఇప్పటికే అమల్లోకి తెచ్చేశాడు… ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్. ఇండియాలో ఎప్పటి నుంచి వెరిఫైడ్ యూజర్ల దగ్గర ఛార్జీలు వసూలు చేస్తారంటే… ఇంకో నెల పట్టొచ్చని చెప్పిన మస్క్… ఆ మాట చెప్పాక కనీసం నాలుగైదు రోజులు కూడా ఆగలేకపోయాడు. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నెలకు రూ.719 చెల్లించాలని కొందరు యూజర్లకు మెసేజ్‌లు వస్తుండటంతో… ఇక భారత్‌లో కూడా మస్క్ బాదుడు మొదలైపోయిందంటున్నారు.


బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్లోని ఐఫోన్ యూజర్ల నుంచి నెలకు 7.99 డాలర్లు వసూలు చేస్తున్నాడు… మస్క్. ఇప్పుడు భారత్ లోనూ ఛార్జీల వసూలుకు సిద్ధమయ్యాడు. అయితే… ఇతర దేశాల్లోలాగే ఇండియాలోనూ ముందుగా ఐఫోన్ యూజర్ల నుంచే బ్లూ టిక్‌ ఛార్జీలు వసూలు చేయబోతున్నాడు… మస్క్. త్వరలో బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి కూడా నెలకు రూ.719 రూపాయలు వసూలు చేస్తారనే చర్చ జరుగుతోంది. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలకు సంబంధించిన మెసేజ్‌లు వచ్చిన యూజర్లలో కొందరు… వాటిని స్క్రీన్‌ షాట్లు తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా కనిపిస్తోంది. బ్లూ టిక్‌ కావాలనుకుంటే ఈ మొత్తం చెల్లించాలి. ఆ ఫీచర్ వద్దనుకుంటే రూపాయి కూడా కట్టక్కర్లేదు.

డబ్బు కట్టి ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే బ్లూటిక్‌ వస్తుంది. బ్లూ టిక్‌ ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు కూడా అందుబాటులోకి తెస్తామని మస్క్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే వెరిఫికేషన్ లేకుండా బ్లూ టిక్ ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో… కొందరు ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ట్విట్టర్ అధికారిక గుర్తును తీసుకొచ్చింది. అయితే, ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించి గందరగోళం ఏర్పడటంతో… కొన్ని గంటల్లోనే అధికారిక గుర్తును వెనక్కి తీసుకుంది… ట్విట్టర్.


Related News

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Delivery boy: ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి.. వివాహితపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం!

Duleep Trophy: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్‌కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు

Big Stories

×