BigTV English

NTR: హరికృష్ణ కొడుకులను దూరం పెట్టిన బాలకృష్ణ కుటుంబం.. చివరికి పేర్లు కూడా.. ?

NTR: హరికృష్ణ కొడుకులను దూరం పెట్టిన బాలకృష్ణ కుటుంబం.. చివరికి పేర్లు కూడా.. ?

NTR: నందమూరి ఇంట అసలేం  జరుగుతుంది.. ? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ సాగుతుంది. గత కొన్నేళ్లుగా నందమూరి  కుటుంబం.. మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ ను దూరం పెడుతూవస్తుందని  వార్తలు వినిపిస్తున్న  విషయం తెల్సిందే. నందమూరి హరికృష్ణ  మొదటి భార్య  కొడుకులు, నందమూరి జానకి రామ్, నందమూరి కళ్యాణ్ రామ్.. రెండో భార్య కొడుకు ఎన్టీఆర్. చిన్నతనం నుంచి ఎవరు ఎన్ని అనుకున్నా.. ముగ్గురు కొడుకులను హరికృష్ణ ఎంతో ప్రేమగా పెంచాడు.


జానకీ రామ్  రోడ్డుప్రమాదంలో చనిపోయిన దగ్గర నుంచి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారు. ఇక ఆ తరువాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటివరకు ఎన్ని గొడవలు ఉన్నా.. హరికృష్ణ కొడుకులుగా నందమూరి కుటుంబంలో ఒక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ అన్నదమ్ములు. ఇక తండ్రి మరణం తరువాత వీరు ఏకాకులగా మారిపోయారు. హరికృష్ణ స్థానాన్ని బాబాయ్ బాలకృష్ణ అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ ను, ఎన్టీఆర్ ను కొడుకులుగా అక్కున చేర్చుకున్నాడు.

కానీ, ఈ మధ్యలో ఏమైందో ఏమో కానీ.. బాబాయ్ – అబ్బాయ్ ల మధ్య దూరం పెరిగింది. బాలయ్య ఇంట్లో జరిగే ఏ ఈవెంట్ కు ఈ అన్నదమ్ములు హాజరు కారు. ఒకవేళ హాజరు అయినా.. ఇంట్లో సభ్యులుగా మెలగడం ఎవరు చూసింది లేదు. వీరి మధ్య దూరం.. అగాధంగా మారింది. చివరికి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో కూడా ఈ అన్నదమ్ములు కనిపించింది లేదు. అసలు వీరికి నందమూరి కుటుంబం ఆహ్వానం  కూడా పంపలేదని సమాచారం. ఆ  వేడుక జరిగే సమయంలో కళ్యాణ్ రామ్ షూటింగ్ లో పాల్గొనగా.. ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు.


Anil Ravipudi : మెగాస్టార్ మూవీకి అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ డబుల్… ఎన్ని కోట్లంటే?

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నోసార్లు వీరి మధ్య ఉన్న విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏ ఈవెంట్ కు వెళ్లినా.. బాలయ్య ఎప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడి ఎరుగడు.  ఇంకోపక్క ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం బాబాయ్ గురించి గొప్పలు చెప్పుకుంటూనే  వస్తున్నారు. మొన్నటికి మొన్న బాలయ్యకు పద్మభూషణ్ వరించిన విషయం తెల్సిందే. ఈ వార్త వినగానే అందరి కన్నా  ముందు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. బాలయ్య చేసిన సేవలకు ఈ అవార్డు నిదర్శనమని సంబురపడిపోతూ పోస్టులు పెట్టుకొచ్చారు.

ఇక బాలయ్య మాత్రమే కాదు.. నందమూరి మరియు నారా కుటుంబం మొత్తం ఈ ఇద్దరు అన్నదమ్ములను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నందమూరి – నారా కుటుంబ సభ్యులు.. ఆయనకు  శుభాకాంక్షలు తెలుపుతూ యాడ్స్ వేయించారు.

“క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉన్న మాస్ హీరో అన్నివేళలా ప్రజలకు అండగా నిలిచే నిబద్ధతగల నాయకుడు. క్యాన్సర్ పేషంట్లను, పేదలను ఆదుకునే అస్తుడు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక తాతగా తన బాధ్యతలను ఏనాడూ మరువని వ్యక్తి. మీకు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు మేసుందరం ఎంతో గర్విస్తున్నాం.. మీ చుట్టూ ఉండే అందరి జీవితాలకు వెలుగును పంచుతూ… మీరు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి” అంటూ నందమూరి- నారా కుటుంబంలో  ఉన్న ప్రతి ఒక్కరి పేరు రాయించారు.

చివరకు చిన్నపిల్లలు అయిన దేవాన్ష్, ఆర్యవీర్ పేర్లు కూడా వేయించారు. కానీ.. ఎక్కడా నందమూరి ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ పేర్లు కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి నందమూరి ఫ్యామిలీపై ఫైర్ అవుతున్నారు. కనీసం పేర్లలో కూడా రాయించలేనంతగా  దూరం పెట్టేశారా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట  వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×