Indian Navy : భారత నావికాదళంలో పనిచేయాలనుకుంటున్న వారికి ఇదో శుభవార్త. 217 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పరీక్షలో పాస్ అయి ఎంపికైన అభ్యర్ధులకు కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో జూన్ 2023 నుంచి శిక్షణనివ్వడం ప్రారంభిస్తారు.
ఆసక్తిగల అభ్యర్ధులు సంబంధిత విద్యార్హత కలిగి ఉండాలి. డిగ్రీలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. కొన్ని పోస్టులకు కమర్శియల్ పైలెట్ లైసెన్స్‌ను కూడా అభ్యర్ధి కలిగి ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 217
దరఖాస్తు ప్రారంభం : 21-10-2022
దరఖాస్తు చివరి తేది : 06-11-2022
దరఖాస్తు ఎలా చేయాంటే : ఆన్‌లైన్‌లో ఈ అధికారిక వెబ్‌సైట్ https://indiannavy.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి