BigTV English

Now Layoffs in Media Also : ఇక ఇప్పుడు మీడియా వంతు…

Now Layoffs in Media Also : ఇక ఇప్పుడు మీడియా వంతు…

Now Layoffs in Media Also : ఆదాయాల్లో క్షీణత, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పటిదాకా టెక్, ఈ-కామర్స్, స్టార్టప్ కంపెనీలే కోతలకు పదునుపెట్టగా… ఇప్పుడా లైన్లో మీడియా రంగం కూడా వచ్చి చేరబోతోంది.


ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా వివిధ సంస్థలు ప్రకటనలపై చేసే ఖర్చును బాగా తగ్గించడంతో… ఆ ప్రభావం మీడియా రంగంలోని ఉద్యోగాలపై పడి తొలగింపులు మొదలయ్యాయని… యాక్సియోస్ అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. గత నెలలో మీడియా రంగంలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులపై వేటు పడిందని వెల్లడించింది. వార్నర్‌ బ్రదర్స్‌కు చెందిన డిస్కవరీలో ఉద్యోగాల కోత కొనసాగుతుండగా… భవిష్యత్తులో సిబ్బందిని ఇంటికి పంపేందుకు ఇతర మీడియా యాజమాన్యాలు కూడా సిద్ధమయ్యాయని CNN చీఫ్ క్రిస్ లిచ్ట్‌ చెప్పారు.

పారామామౌంట్‌ గ్లోబల్‌, వాల్ట్‌ డిస్నీ కంపెనీలతో పాటు ఇతర మీడియా సంస్థలు కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేస్తున్నాయని, కొత్త నియామకాల్ని కూడా నిలిపివేశాయని యాక్సియోస్ తెలిపింది. గత నెలలో ఉద్యోగుల్ని తొలగించిన కామ్‌క్యాస్ట్‌ కేబుల్ యూనిట్… ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం, ఎన్‌బీసీ యూనివర్సల్‌లో కూడా కోతలు పెట్టేందుకు సిద్ధమైందంటున్నారు. 2020లో ప్రారంభమైన టెక్ న్యూస్ వెబ్‌సైట్‌ను… ఈ ఏడాది చివరికి షట్‌డౌన్‌ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారని, దాంతో 60 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనున్నారని యాక్సియోస్ తెలిపింది. ఇక వైస్ మీడియా సీఈవో నాన్సీ డుబాక్ కూడా… 15 శాతం వరకు ఖర్చు తగ్గించుకునే ఆలోచన చేస్తున్నానని, కొందర్ని తొలగిస్తానని ఈ నెల ప్రారంభంలోనే సిబ్బందికి హింట్ ఇచ్చాడు. గత ఆగస్ట్‌లో 400 మందిని తొలగించిన USA టుడే మాతృ సంస్థ గానెట్, మరోసారి ఉద్యోగుల్ని ఫైర్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తమ్మీద నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం, ఆదాయం తగ్గిపోవడంతో… మీడియా సంస్థలు కూడా కోతల బాట పట్టాయని నిపుణులు చెబుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×