E-Paper
Advertisement

Old Inkjet Printers:-బ్యాక్టీరియాను కనిపెట్టే ప్రింటర్లు.. 40 ఏళ్ల టెక్నాలజీతో..

Old Inkjet Printers:-బ్యాక్టీరియాను కనిపెట్టే ప్రింటర్లు.. 40 ఏళ్ల టెక్నాలజీతో..

Old Inkjet Printers:-ఇతర టెక్నాలజీల ద్వారా కనుక్కోలేని ఎన్నో విషయాలు లైట్ ద్వారా కనుక్కునే సౌలభ్యం ఉంది. మామూలుగా లైట్‌ను ఒక చుక్క రక్తంపై కానీ, వేస్ట్‌వాటర్‌పై కానీ వేసినప్పుడు దాని ప్రతిబింబంలో బ్యాక్టిరియాను కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఇలాగే ఎన్నో వస్తువుల్లో బ్యాక్టీరియా ఉందో లేదో కనుక్కోవడానికి లైట్ ఉపయోగపడుతుంది. తాజాగా మరో పరికరంతో కూడా బ్యాక్టీరియాను కనుక్కునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

లైట్ ద్వారా వస్తువుల్లో బ్యాక్టీరియా ఉందా లేదా అని కనుక్కోవడమే కాకుండా.. ఎలాంటి బ్యాక్టీరియా ఉంది అని కూడా కనుక్కునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతీ బ్యాక్టీరియాకు ప్రత్యేకమైన ఫింగర్‌ప్రింట్ ఉంటుంది. లైట్ ద్వారా దానిని క్షుణ్ణంగా గమనించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు బ్యాక్టీరియాపై స్టడీ చేసే ప్రక్రియలు ఖరీదైనవి మాత్రమే కాకుండా చాలా సమయాన్ని తీసుకునేవిగా ఉన్నాయి. తాజాగా ఒక సీనియర్ శాస్త్రవేత్త.. ఇందులో మరింత సులువైన ప్రక్రియను కనుగొన్నారు.

బ్యాక్టీరియా కనుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న ప్రక్రియలు గంటలు.. ఒక్కొక్కసారి రోజుల వరకు పొడగించబడతాయి. అలా కాకుండా తక్కువ ఖర్చుతో, ఖచ్చితమైన బ్యాక్టీరియా రకాన్ని కనిపెట్టే విధంగా ఈ కొత్త ప్రక్రియ ఏర్పాటు కానుంది. మనిషి శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచిది కానీ ఇప్పుడు ఉన్న ట్రెడీషినల్ మార్గాల వల్ల అది కుదరడం లేదు. ఉదాహరణకు టీబీని కనుక్కోవడానికి దాదాపు 40 రోజులు పడుతుంది. ఇక త్వరలోనే ఇలాంటి సమస్యకు చెక్ పడనుంది.

ఇంక్‌జెట్ ప్రింటర్ ద్వారా బ్యాక్టీరియా నిమిషాల్లో కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా బ్లడ్ సెల్స్‌లో బ్యాక్టీరియాను కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. బ్లడ్‌లోని సెల్స్‌పై లైట్ పడినప్పుడు అవి వాటినే రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే లైట్‌తో కాకుండా ఈ ప్రింటర్ సహాయంతో బ్యాక్టీరియాను, దాని రకాన్ని కూడా సులువుగా కనుక్కోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. 40 ఏళ్లనాటి టెక్నాలజీతో ఇది సాధ్యమయ్యిందని వారు బయటపెట్టారు.

బ్యాక్టీరియాను కనిపెట్టాలంటే ముందుగా దానిని బ్లడ్ సెల్స్ నుండి వేరుచేయాలి. దానికోసమే ఇంక్‌జెట్ ప్రింటింగ్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రక్రియలో కూడా పలు సూచనలు ఫాలో అవ్వాలని వారు అన్నారు. ఇది బ్యాక్టీరియాను గుర్తించగలదు అని మాత్రమే కనిపెట్టగలింగిందని, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే బ్యాక్టీరియాను గుర్తించడంలో ఇది ఒక కొత్త అద్భుతంగా మారనుందని వారు భావిస్తున్నారు.

Follow this link for more updates:- BIGTV

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×