BigTV English

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

PM Modi addresses World Summit: ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని, ప్రపంచమంతా కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా మన దేశం ‘భారత్ శతాబ్ధి’ గురించి ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన ఓ సమ్మిట్ లో ప్రారంభోత్సవంలో భాగంగా మాట్లాడారు. దేశం ప్రతీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అభివర్ణించారు.


బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 125 రోజులు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ఈ మేరకు ఈ సమయంలో మా ప్రభుత్వ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాన్నారు. పేదలకు రూ.3 కోట్ల కొత్త నివాసాలను ఇచ్చామని, రూ.9లక్షల కోట్ల ఇన్ఫా ప్రాజెక్టులపై పని మొదలైందన్నారు. ఇప్పటికే 15 వందేభారత్ రైళ్లు ప్రారంభించామని, 8 కొత్త ఎయిర్ పోర్టుల పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

యువతకు రూ.2లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని, రైతుల ఖాతాల్లో రూ.21వేల కోట్లను బదిలీ చేశామన్నారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశామని, 5 లక్షల ఇళ్లల్లో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ మార్కెట్ సూచీల్లో దాదాపు 7 శాతం వృద్ధి నమోదైందన్నారు. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్ డాలర్లకు దాటేసిందన్నారు.ఈ అభివృద్ధి 125 రోజుల్లో జరిగిందేనన్నారు.


Also Read: మహారాష్ట్రలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఈ సమయంలో భారత్‌లో ప్రపంచం మూడు విషయాలు చర్చించడానికి వచ్చిందన్నారు. టెలికామ్ డిజిటల్ ప్యూచర్‌పై అంతర్జాతీయ అసెంబ్లీ జరిగిందన్నారు. ఈ మేరకు గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ నిర్వహించారు. గ్లోబల్ సెమి కండెక్టర్ ఎకోసిస్టమ్ పై సదస్సు జరిగిందన్నారు. ఈ సమావేశాలు భారత్ దిశ.. ప్రపంచం దిశను తెలియజేస్తున్నాయన్నారు.

ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుందని, మా ప్రభుత్వం మూడో విడత పాలనలో రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధిరేటును గణనీయంగా పెంచాయన్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేదల కష్టాలు తమకు తెలుసన్నారు. కాగా, అంతకుముందు ఆయన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విదేశీ అతిథులను కలుసుకొన్నారు. రెండురోజులపాటు జరగనున్న ఈ సదస్సులో యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామరూన్, భూటాన్ ప్రధాని దాసో త్సేరింగ్ టోబ్గే, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్ తదితరులు పాల్గొననున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×