BigTV English

Purushothamudu: పూల రైతుల సమస్యలను తెరపై చూపించిన ‘పురుషోత్తముడు’.. సక్సెస్ మీట్

Purushothamudu: పూల రైతుల సమస్యలను తెరపై చూపించిన ‘పురుషోత్తముడు’.. సక్సెస్ మీట్

Purushothamudu Movie: కంటెంట్ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రామ్ భీమన తీసిన ‘పురుషోత్తముడు’ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ రావటమే కాదు.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ సినిమాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, మురళి శర్మ, ముకేష్ ఖన్నా వంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. భారీ బడ్జెట్‌తో శ్రీశ్రీ దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్‌లు నిర్మించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా, హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించారు.


సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడుతూ.. ‘నేను దర్శకత్వం వహించిన పురుషోత్తముడు సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటు మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. పూల రైతుల సమస్యలను తెరపై చూపించడం అనేది ఒక కొత్త ప్రయత్నం. ఇందుకు గాను సినిమా ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సినిమాను స్టార్ హీరోతో చేసి ఉంటే మరింత బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేదని చెబుతున్నారు. అయితే, మేం కంటెంట్‌ను నమ్మాం.. అది బాగుంటే చాలు ప్రేక్షకులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని బిలీవ్ చేశాం. ఈరోజు థియేటర్లలో ప్రేక్షకులు ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక అవార్డ్స్ కోసం ఈ సినిమాను సెండ్ చేస్తాం’ అంటూ భీమన పేర్కొన్నారు.

Also Read: క్షమించండి.. ‘యానిమల్‌’లో ఆ సీన్ చేసినందుకు.. : రణబీర్ కపూర్


అనంతరం నిర్మాత డా. రమేశ్ తేజావత్ మాట్లాడుతూ.. ‘మేం నిర్మించిన పురుషోత్తముడు సినిమాకు పబ్లిక్ నుంచి మంచి టాక్ వినిపిస్తున్నది. ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని తీశారంటూ ప్రేక్షకులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి. జీవితంలో ఎలా జీవించాలి.. ఎలా ధర్మంగా ముందుకు సాగాలి అనేది ఈ సినిమాలో చూసి నేర్చుకోవొచ్చు. ఈ సినిమాలో అసభ్యత, అశ్లీలత అనే మాటలకు తావే లేదు. త్వరలో పురుషోత్తముడు-2ను తీసేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత అన్నారు.

ఆ తరువాత హీరోయిన్ హాసినీ సుధీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన అమ్ములు క్యారెక్టర్‌కు మంచి స్పందన వచ్చింది. స్క్రీన్ మీద అందంగా ఉన్నావంటూ చెబుతుంటే నాకు తెగ ఆనందంగా ఉంది. లంగావోణి కట్టుకుంటే ఆడియెన్స్‌కు నచ్చకుండా ఎలా ఉండగలను మీరే చెప్పండి’ అంటూ ఆమె పేర్కొన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×