BigTV English

Hydra Demolish in Madhapu: మాదాపూర్‌పై హైడ్రా కన్ను.. అక్రమంగా నిర్మాణాలు కూల్చివేత

Hydra Demolish in Madhapu: మాదాపూర్‌పై హైడ్రా కన్ను.. అక్రమంగా నిర్మాణాలు కూల్చివేత

Hydra Demolish in Madhapu: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు ఫిర్యాదు అందిన వాటిపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యం లో సోమవారం ఉదయం మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు ప్రాంతంపై దృష్టి సారించారు హైడ్రా అధికారులు.


కావూరి హిల్స్ పార్క్‌ ప్రాంతాన్ని ఆక్రమించిన నిర్మాణాలు చేస్తున్నారు కొందరు కబ్జాదారులు. దీనిపై కావూరి హిల్స్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరాలు సేకరించిన అధికారులు, స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు.

సోమవారం ఉదయం బుల్‌డోజర్స్‌తో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. ఈ ప్రాంతమంతా కావూరి హిల్స్ పార్క్ అంటూ బోర్డును ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా కూల్చివేతలపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు రియాక్ట్ అయ్యారు. కావూరి హిల్స్ అసోసియేషన్ తమకు 25 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిందని, గడువు ముగియక ముందే నిర్మాణాలను తొలగిస్తున్నారని వాపోయారు.


రేవంత్‌రెడ్డి కేబినెట్ నిర్ణయం తర్వాత హైడ్రా దూకుడు పెంచింది. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసేది. తాజాగా సోమవారం కావూరి హిల్స్ పార్క్ ప్రాంతంలో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీని కూల్చివేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని కూల్చివేసినట్టు అధికారులు చెబుతున్నమాట.

ALSO READ:  కేసీఆర్ సెలైంట్ ఎందుకు? దూరమవుతున్న ఆ వర్గాలు

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రభుత్వ భూముల కబ్జా, చెరువులు, నాలాలు, బఫర్‌ జోన్లు ఆక్రమించిన వారిపై దృష్టి పెట్టింది. ఆదివారం (సెప్టెంబరు 22న) 17 గంటలపాటు నాన్ స్టాప్ ఆపరేషన్ చేపట్టింది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఆక్రమ నిర్మాణాలను తొలగించింది.

అమీన్‌పూర్ మున్సిపాలిటీ, కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద కబ్జా చేసి నిర్మించిన షెడ్లను తొలగించింది. ఆయా స్థలాలను ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా. ఇప్పటివరకు 120 ఎకరాల మేరా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడింది హైడ్రా. 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను తొలగించి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం 30 టీమ్‌లకు కేవలం మూడు మాత్రమే పని చేస్తున్నాయి.

 

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×