
Rolls Royce Spectre: ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న క్రేజ్‌ను చూసి లగ్జరీ కార్ సంస్థలు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రీమియం కార్ల సంస్థ.. రోల్స్ రాయిస్ కూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఇంకా ఈ కారు గురించి పూర్తిగా వివరాలు తెలియక ముందే రోల్స్ రాయిస్ మొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్ట్రే సూపర్ కోప్‌కు ప్రీ బుకింగ్ కోసం లైన్ కడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రీ బుక్సింగ్స్ ఫుల్ అయిపోయాయని సంస్థ తాజాగా ప్రకటించింది.
2024 వరకు రోల్స్ రాయిస్ స్పెక్ట్రే ప్రీ ఆర్డర్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయని యాజమాన్యం అంటోంది. 2023 చివరి నుండి ముందుగా బుక్ చేసుకున్న వారికి కార్లు అందుతాయని తెలిపింది. ఇక 2030 వచ్చేసరికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని రోల్స్ రాయిస్ చెప్తుంది. ఒకవైపు రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ ఫుల్ స్పీడ్‌లో ఉండగా.. ఇతర మోడల్స్ సేల్స్ విషయంలో ఈ సంస్థ కాస్త వెనకబడిందని రిపోర్టులు చెప్తున్నాయి.
2023 మొదట్లో రోల్స్ రాయిస్ మొత్తంగా 3,181 కార్లను అమ్మనట్టు తెలుస్తోంది. అంటే గతంతో పోలిస్తే కార్ సేల్స్ 0.3 శాతం తగ్గాయి. 2022లో కంపెనీ కొత్త ఆర్డర్లు తీసుకోవడం మానేసి.. ప్రీ బుకింగ్ ఆర్డర్లకు మాత్రమే కార్లు డెలివరీ చేసింది. 2023లో సేల్స్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అయ్యిండవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ రెండేళ్లలో రోల్స్ రాయిస్ అమ్మిన డాన్ మోడల్ కారుకు విపరీతమైన క్రేజ్ లభించింది. రోల్స్ రాయిస్ హిస్టరీలోనే డాన్‌కు లభించినంత క్రేజ్ ఇంకా ఏ మోడల్‌కు లభించలేదని నిపుణులు అంటున్నారు.
2023 ఏప్రిల్, జూన్ నెలల్లోనే రోల్స్ రాయిస్ మొత్తంగా 1,541 కార్లను అమ్మింది. గతేడాది ఇదే సమయంలో జరిగిన సేల్స్‌తో పోలిస్తే.. ఈ ఏడాది 1.7 శాతం తగ్గినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇలా తగ్గిపోయిన రోల్స్ రాయిస్ సేల్స్‌కు ఊరటనిచ్చాయి ఎలక్ట్రిక్ కారు ప్రీ బుకింగ్స్. స్పెక్ట్రే చూడడానికి కుల్లీవనాన్, ఫాంటమ్ మోడల్స్‌ను పోలి ఉంటుందని యాజమాన్యం చెప్తుంది. ప్రస్తుతం స్పెక్ట్రేకు సంబంధించి ఫైనల్ అడ్జస్ట్‌మెంట్స్, పవర్, యాక్సిలరేషన్ లాంటి పనులు జరుగుతున్నాయని బయటపెట్టింది.