BigTV English

Robinhood : హైదరాబాద్ కి వస్తున్న వార్నర్… నితిన్ భలే ప్లాన్ చేశాడు భయ్యా..

Robinhood : హైదరాబాద్ కి వస్తున్న వార్నర్… నితిన్ భలే ప్లాన్ చేశాడు భయ్యా..

Robinhood : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ( Nithin) ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’ ( Robinhood ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. షూటింగు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. మార్చ్ 28న సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో సినిమాపై భారీ క్రియేట్ చేసేందుకు వరుసగా అప్డేట్లను రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి పాటలు, టీజర్ విడుదల చేయగా.. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


Also Read :  ‘రాజా సాబ్ ‘ లో రెండు ట్విస్టులు.. ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేయబోతున్న డైరెక్టర్..!

‘రాబిన్ హుడ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..


టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాబిన్ హుడ్.. అయితే ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ ఎంట్రీ ఉండబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రలో ప్రముఖ క్రికెట్ వార్నర్ నటించబోతున్నాడు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డేవిడ్ వార్నర్ హాజరు కాబోతున్నారంటు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల ( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుంది..

డేవిడ్ వార్నర్ రోల్ గురించి లీక్ చేసిన నిర్మాత.. 

ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకు తెలుగు సినిమాలంటే ఇష్టం. ఇప్పటివరకు తెలుగులో ప్రముఖ హీరోల సినిమాల్లోని కొన్ని సీన్స్ ని రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. దాంతో ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కేవలం తెలుగు హీరోల డైలాగులతో ఫేమస్ అయిన ఈయన ఇప్పుడు ఏకంగా ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాడన్న వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మూవీ షూటింగ్ కోసం వార్నర్ రోజుకు కోటి రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా రీల్స్ తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వార్నర్ ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ సినిమాలో బిగ్ స్క్రీన్ పై కనిపిస్తుండడం విశేషం.. అతని పెర్ఫార్మన్స్ ఎలా ఉందో చూడటానికైనా జనాలు థియేటర్ వస్తారు. అలా సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటు గత కొన్నేళ్లు గా నితిన్ ఖాతాలో సరైన హిట్ సినిమా లేదు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నితిన్.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అందించాయి ఇక సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మార్చి 28 వరకు వెయిట్ చేయాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×