Emotional Movies OTT: హాలీవుడ్ సినిమాలంటే చాలామంది అదరగొట్టి యాక్షన్స్ సన్నివేశాలు మాత్రమే ఉంటాయని అనుకుంటారు. కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు.. గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ సినిమాలు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ అందిస్తుంది.. ఈ మధ్య హాలీవుడ్ సినిమాల్లో ఎమోషనల్ యాడ్ చేస్తున్నారు.. చాలా బ్రాడ్ మైండ్ తో ఉండే హాలీవుడ్ వాళ్లు కూడా ఇలాంటి సీన్లు చేస్తారంటే నమ్మడం కాస్త కష్టమే కానీ ఇలాంటి సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నారు.. మరి ఇక ఆలస్యం ఎందుకు అలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుస్తుంది.. ఎమోషనల్ కథలతో వచ్చిన సినిమాలు ప్రశంసలకు ఉన్నాయి.. ఆ సినిమాలలో ఒక మూడు సినిమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ది పియానిస్ట్..
ఆడ్రియన్ బ్రాడీ కీలక పాత్రలో నటించిన మూవీ ది పియానిస్ట్.. ఈ చిత్రం 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా సర్వస్వం కోల్పోయిన తర్వాత కుటుంబం తన కుటుంబీకులను కోల్పోయి ఉంటుంది. కుటుంబంతో విడిపోయి చాలా కష్టాలను ఎదుర్కొనే ఓ పాపులర్ మ్యూజిషియన్ చుట్టూ ఈ ఎమోషనల్ బయోగ్రాఫికల్ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ అవటంతో పాటు చాలా అవార్డులను దక్కించుకుంది.. ఈ చిత్రానికి రోమాన్ పోలాన్‍స్కి దర్శకత్వం వహించారు.. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.. అయితే అమౌంట్ చెల్లించి దీన్ని చూడాలి..
Also Read : ‘రాజా సాబ్ ‘ లో రెండు ట్విస్టులు.. ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేయబోతున్న డైరెక్టర్..!
ది నోట్ బుక్..
ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లే నోట్ బుక్ చుట్టూ స్టోరీని అల్లేశాడు డైరెక్టర్. భావోద్వేగాలతో సాగే లవ్ స్టోరీ. యుద్ధం, సామాజిక అసమానతల వల్ల విడిపోయి వేదన అనుభవించే ఓ ప్రేమ జంట కథతో ఈ మూవీ తెరకెక్కింది. 2004లో వచ్చిన ఈ మూవీ అందరిని షాక్ కు గురి చేసేలా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిక్ కాసావెటెస్ దర్శకత్వం వహించారు. ది నోట్‍బుక్ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దీన్ని చూడొచ్చు..
ది బీచ్..
ఇదొక అడ్వెంచర్ డ్రామా మూవీ ది బీచ్.. అంతేకాదు ఎమోషనల్‍గా సాగుతుంది. లినార్డో డికాప్రియో లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డానీ బోయ్లే దర్శకత్వం వహించారు. థాయ్‍లాండ్ సమీపంలో సముద్రం మధ్యలో ఉండే ఓ విలాసవంతమైన దీవికి వెళ్లిన వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితుల గురించి ఈ మూవీలో చూపించారు.
ఇవే కాదు ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ కన్నీళ్లు తెప్పించే రేంజ్‍లో ఎమోషనల్‍గా ఉంటుంది. ఈ మూవీలో విల్ స్మిత్, జాడెన్ స్మిత్ ప్రధాన పాత్రలు పోషించారు.. అదే విధంగాటిమ్ రాబిన్స్ ప్రధాన పాత్ర పోషించిన ది షషాంక్ రెడెంప్షన్ ఎమోషనల్ ప్రిజన్ డ్రామాగా తెరకెక్కింది.. వీటితో పాటుగా ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలే కాదు ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయి..