E-Paper
Advertisement

Satellite Crop Survey: రాష్ట్రంలో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి.. ఈసారి విస్తీర్ణం 8 నుంచి 12% తక్కువ నమోదు

Satellite Crop Survey: రాష్ట్రంలో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి.. ఈసారి విస్తీర్ణం 8 నుంచి 12% తక్కువ నమోదు
Advertisement

Satellite Crop Survey: స్వేఛ్చబ్యూరో: రాష్ట్రంలో సుమారు పదివేల రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి అయిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అద్దాస్ జానయ్య(Professor Addas Janayya) తెలిపారు. సైఫాబాద్ లోని కమ్యూనిటీ కళాశాలలో శనివారం మీడియాతో మాట్లాడారు. శాటిలైట్ ఆధారిత పంటల విస్తీర్ణం లెక్కింపు పై ప్రభుత్వానికి ఫిబ్రవరి 6న నివేదిక అందజేయను ఉన్నామని వెల్లడించారు. మొత్తం సాగు విస్తీర్ణంలో 8 నుంచి 12% తక్కువ నమోదు అవుతున్న పంట విస్తీర్ణం అవుతుందన్నారు.

ఎస్ఏఆర్ఎంఎపితో ఒప్పందం

జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత ఏడాది అధునాతన డిజిటల్ వ్యవసాయ మరియు సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి అందులో భాగంగా అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలతో పాటు రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ ప్రయోగశాల కూడా అధునాతన పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారన్నారు. గత కొన్ని మాసాలుగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారిగా పంటల విస్తీర్ణాన్ని కచ్చితంగా లెక్కించే ఒక వినూత్న పథకాన్ని స్విట్జర్ ల్యాండ్ లోని ప్రపంచ ప్రఖ్యాత శాటిలైట్ చిత్రాల విశ్లేష సంస్థ అయినా ఎస్ఏఆర్ఎంఎపితో ఒప్పందం చేసుకొని ప్రారంభించారు. ఈ వినూత్న సాంకేతిక ప్రొజెక్ట్ ఫలితాలని వ్యవసాయ గ్రామస్థాయి సిబ్బంది పరిశీలించినప్పుడు సుమారు 90% వరకు కచ్చితంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోని మొత్తం రెవిన్యూ గ్రామాలలో సుమారు 870 గ్రామాల మ్యాపులు లభ్యం కానందున వాటిని మినహాయించి మిగతా అన్ని రెవిన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది.

Advertisement

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు మరో అరుదైన ఆహ్వానం.. ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలంటూ లేఖ

ప్రతి రైతుకు భీమా పరిహారం

ప్రాథమిక ఫలితాల ప్రకారం సరాసరిగా మొత్తం సాగు యోగ్యమైన విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవంగా పంటలు వేసిన విస్తీర్ణం 8-12% వరకు తక్కువగా ఉన్నట్లు తేలింది. అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన పూర్తి నివేదికను ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కి అందజేయున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కింపుతో పంటల భీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు భీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకతతో పాటు సకాలంలో అమలు చేసే వీలు ఉంటుందని, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో అర్హత కల ప్రతి రైతుకి పథకాలు చేరే విధంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Advertisement

Also Read: Mega158 Chiranjeevi: ‘మెగాస్టార్ 158’లో చిరుకు జోడీ కన్ఫామ్ చేసిన దర్శకుడు.. ఎవరంటే?

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×