BigTV English

Supernova: సూపర్‌నోవా ద్వారా గ్రహాంతరవాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం..

Supernova: సూపర్‌నోవా ద్వారా గ్రహాంతరవాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం..

Supernova: అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మామూలు మనుషులకు ఎంత ఆసక్తిగా ఉంటుందో.. శాస్త్రవేత్తలకు కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది. కానీ ఎన్నో ఏళ్లుగా దీనికి సరైన సమాధానం మాత్రం వారికి దొరకలేదు. గ్రహాంతరవాసులు కచ్చితంగా ఉన్నాయి అని భావించే శాస్త్రవేత్తలు కొందరు ఉంటే.. అసలు ఆధారాలు లేనిది ఉంది అని నమ్మడం ఎలా అని మరికొందరు అంటున్నారు. తాజాగా ఆ విషయం తెలుసుకోవడానికే కొత్త ప్రయోగం మొదలుపెట్టారు.


గత నెలలో ఉర్సా మేజర్ కాన్స్‌టిల్లేషన్ దగ్గర సూపర్‌నోవాను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఒక్కసారిగా వారు దృష్టి అంతా దానివైపు మళ్లింది. ఏదైనా ప్రకశవంతమైనది, పవర్‌ఫుల్ అయినది పేలినప్పుడు, దాని వల్ల వచ్చే వెలుగును చూడడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా ఆసక్తి చూపిస్తూ, దీనిపై ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. వచ్చే కొన్నాళ్ల పాటు ఈ సూపర్‌నోవాపై మాత్రమే దృష్టిపెట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

ఈ సూపర్‌నోవాలో శాస్త్రవేత్తలు అసలు ఏం వెతుకుతున్నారంటే గ్రహాంతరవాసుల నుండి వస్తున్న సిగ్నల్స్. ఈ సూపర్‌నోవా అనేది ఏలియన్స్ చేసిన పని వల్లే ఫార్మ్ అయ్యిందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. 1970 నుండి శాస్త్రవేత్తలకు ఇలాంటి ఆలోచన ఉన్నా.. సూపర్‌నోవా ద్వారా ఏలియన్స్‌ను కనిపెట్టాలని వారు చేస్తున్న మొదటి ప్రయోగం మత్రం ఇదే. మామూలుగా ఏలియన్స్‌కు కూడా లైట్ ఇయర్స్ నుండి సిగ్నల్‌ను ట్రాన్స్‌మిట్ చేయడం సులువైన విషయం కాదని వారికి కూడా తెలిసినా.. అసలు ఈ ప్రయోగం ఎక్కడివరకు తీసుకువెళ్తుందని వారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు.


ఒకవేళ సూపర్‌నోవానే వారి కమ్యూనికేషన్‌కు సూచన అయితే.. దీనిపై ప్రయోగాలు చేస్తున్న సమయంలో ఏలియన్స్ ఏదో విధంగా సిగ్నల్స్ ఇస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఒకవేళ ఈ ప్రయోగాల వల్ల వారికి పెద్దగా ఏమీ తెలియకపోయినా.. ఒకవేళ ఈ ప్రయోగాలు చేయకపోతే మాత్రం కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం మిస్ అయినట్టు ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ సూపర్‌నోవా పేరు ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ అని వారు తెలిపారు.

2023 మే 19న ఈ సూపర్‌నోవా శాస్త్రవేత్తల కంటపడింది. గత కొన్ని దశాబ్దాలలో భూమికి ఇంత దగ్గరగా సూపర్‌నోవా ఫార్మ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇది 21 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంగా ఉన్నా కూడా 6 నుండి 13 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుండి కనిపిస్తోంది. ఈ సూపర్‌నోవా వల్ల ఏర్పడిన ఫ్లాస్ కొన్నాళ్ల వరకు కనిపిస్తూనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూపర్‌నోవాపై ఇలాంటి ఒక ప్రయోగం ఎప్పుడూ జరగలేదని, అందుకే దీని ద్వారా పాజిటివ్ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నామని వారు బయటపెట్టారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×