Big Stories

Space Researches:అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఊపు.. ఈ ఏడాదిలోనే..

Space Researches:అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి గతేడాది ఎన్నో కొత్త అధ్యయనాలు మొదలయ్యాయి. ఒక చిన్న హెలికాప్టర్ మార్స్‌పైకి ఎగిరింది. ఒక గ్రహశకలాన్ని నాసా స్పేస్‌క్రాఫ్ట్ బద్దలుకొట్టింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన టెలిస్కోప్ గాలిలోకి ఎగిరింది. ఇలాంటివన్నీ సక్సెస్ అవ్వడంతో శాస్త్రవేత్తలకు కొత్త ఊపునిచ్చింది. ఇక ఈ ఏడాదిలో అంతకు మించి చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

- Advertisement -

ఇప్పుడు చేస్తున్న ఎన్నో పరిశోధనలు.. కొన్నాళ్ల క్రితం వరకు కట్టుకథలు. ఇలాంటివన్నీ అసలు నిజంగా జరుగుతాయా అనే విషయాలను శాస్త్రవేత్తలు చేసి చూపించారు. ఎన్నో ఏళ్ల పరిశోధనలు, కష్టం తర్వాత వీరు చేసిన పరిశోధనలన్నీ విజయవంతంగా ఆకాశంలోకి ఎగిరాయి. అందుకే ఈసారి మరిన్ని కొత్త కొత్త ఐడియాలను స్వీకరించాలని నాసా నిర్ణయించుకుంది. తాజాగా వారు నిర్వహించిన నియాక్ పోటీలో 14 కొత్త కాన్సెప్ట్స్‌ను ఎంపిక చేశారు. అందులో 5 కాన్సెప్ట్స్ త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

మార్స్‌లో ఇటుకల తయారీ
కంగ్రూ జిన్ అనే శాస్త్రవేత్త ఇప్పటికే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటిని ఉపయోగించి కాంక్రీట్‌లో పగుళ్లు రాకుండా పరిశోధనలు చేశారు. ఇప్పుడు వారి పరిశోధనలను అంతరిక్షానికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. తన సెల్ఫ్ గ్రోయింగ్ బ్రిక్స్ ద్వారా మార్స్‌లో నివాస స్థలాలను ఏర్పాటు చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం బ్యాక్టీరియా, ఫంగస్, బయోరియాక్టర్ లాంటి వాటిని మార్స్‌కు పంపాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం మనుషుల ప్రమయం లేకుండానే జరిగిపోతుందని జిన్ తెలిపారు.

శాటర్న్‌పై పరిశోధనలు
భూమిపై కాకుండా ఎక్కువ పరిశోధనలు మార్స్‌లోనే జరిగాయి. కానీ అది మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర గ్రహాల్లో కూడా పరిశోధనలను చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అలా కొందరు శాటర్న్‌ను తమ పరిశోధన కోసం ఎంచుకున్నారు. సోలార్ సిస్టమ్‌లో ఉండే గ్రహాల్లో శాటర్న్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దీనిపై ఉన్న కెమిస్ట్రీ భభూగంపై ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే 2027లో డ్రాగన్ ఫ్లై అనే ఒక డ్రోన్‌ను దీనిపైకి పంపించి పరిశోధనలు చేయాలని వారు నిర్ణయించారు.

ద్రవ్యంతో టెలిస్కోప్
ఇప్పటికే హబ్బుల్ స్పెస్ టెలిస్కోప్, వెబ్ టెలిస్కోప్ లాంటివి అంతరిక్షంలోకి ఎగిరి పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఇవన్నీ ఎన్నో ఏళ్ల రీసెర్చ్‌కు సమాధానంగా నిలిచాయి. అలా కాకుండా తక్కువ ఖర్చుతో, తొందరగా తయారయ్యే టెలిస్కోప్‌లకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఎడ్వర్డ్ బలాబన్ అనే సైంటిస్ట్ ఒక కొత్త టెలిస్కోప్ డిజైన్‌ను తయారు చేశారు. అదే ఫ్లూట్. అంటే ఫ్యూడిక్ టెలిస్కోప్. దీని కోసం ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను, ఒక లిక్విడ్‌తో నిండిన ఫ్రేమ్‌ను అంతరిక్షంలోకి పంపించాల్సి ఉంటుంది. ఇవి అక్కడ ఫోటోలను తీసి భూమిపైకి పంపించే ఏర్పాట్లు చేస్తాయి.

మరో భూమికై అన్వేషణ
ఇప్పటికే భూమిలాంటి మరో గ్రహాన్ని కనిపెట్టి అక్కడ మానవాళి నివసించవచ్చా లేదా అనేదానిపై పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందుకే హీడీ జో న్యూబెర్గ్ అనే శాస్త్రవేత్త ఎర్త్ 2.0ను కనిపెట్టడానికి ఒక టెలిస్కోప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ టెలిస్కోప్‌కు డైసర్ అని పేరు పెట్టారు. మామూలుగా భూమిలాంటి గ్రహాన్ని కనిపెట్టాలంటే టెలిస్కోప్ అనేది చాలా ప్రయాణించవలసి ఉంటుంది. అందుకే డైసర్.. వెబ్ టెలిస్కోప్ కంటే మూడు శాతం పెద్దగా ఉంటుంది. త్వరలోనే ఈ టెలిస్కోప్ తయారీలో ముందడుగు వేయనున్నారు హీడీ అండ్ టీమ్.

కనిపించని ఆకాశం
ఎన్ని టెలిస్కోప్‌లు తయారు చేసినా.. కొన్ని తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో సిగ్నల్స్‌ను కనిపెట్టడం శాస్త్రవేత్తలకు కష్టంగా ఉంటోంది. అలాంటి సిగ్నల్స్‌ను కనిపెట్టడానికి మేరీ నాప్ అనే సైంటిస్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. భూమి వాతావరణం వల్ల కొన్ని రేడియో టెలిస్కోప్‌లకు ఇలాంటి సిగ్నల్స్ కనిపెట్టడం కష్టమవుతుందని వారు అన్నారు. అందుకే ఆకాశంలో ఇలాంటి రేడియో సిగ్నల్స్‌ను కనిపెట్టాలని కోరికతో వారు పరిశోధనలు మొదలుపెట్టారు. వేల చిన్న చిన్న శాటిలైట్లతో తయారు చేసిన టెలిస్కోప్‌తో ఇది సాధ్యమని వారు భావిస్తున్నారు. గో లో అనే పేరుతో ఈ టెలిస్కోప్ గాలిలో ఎగిరేలా చేయాలని వారు సన్నాహాలు చేస్తున్నారు.

For More Live Updates:-

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News