BigTV English

RahulGandhi: అదానీ వెనుక సర్కారీ షాడోస్ ఎవరు? పార్లమెంట్లో రాహుల్ నిలదీత..

RahulGandhi: అదానీ వెనుక సర్కారీ షాడోస్ ఎవరు? పార్లమెంట్లో రాహుల్ నిలదీత..

RahulGandhi: భారత్ జోడో యాత్ర అంటూ ఆసేతు హిమాచలం పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. యాత్ర సక్సెస్ ఇచ్చిన జోష్ తో పార్లమెంట్ లో మోదీ సర్కారును ఫుల్ గా కార్నర్ చేశారు. అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటూ గట్టిగా నిలదీశారు. దేశమంతా అదానీ వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవాలని అనుకుంటోందని చెప్పారు. మోడీ, అదానీ కలిసి ఉన్న పాత ఫొటోను లోక్ సభలో ప్రదర్శించారు రాహుల్ గాంధీ. రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా రాహుల్.. కేంద్రంపై ఫుల్ ఫైర్ అయ్యారు.


2014లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద.. 2022 నాటికి 140 మిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. కశ్మీర్ యాపిల్స్ నుంచి పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్ల వరకు అన్ని ప్రాజెక్టులను చేపట్టే సత్తా కేవలం అదానీకి మాత్రమే ఎలా సాధ్యమైందని అడిగారు. అదానీ ఏ వ్యాపారం చేసినా కోట్ల లాభాలు ఎలా వచ్చాయని.. ఆ మ్యాజిక్ ఏంటో చెబితే దేశంలో అందరూ సంపన్నులు అవుతారు కదా అంటూ సెటైర్లు వేశారు.

అదానీ కోసం అన్ని వ్యాపార నిబంధనలను బీజేపీ ప్రభుత్వం మార్చిందని రాహుల్ ఆరోపించారు. విదేశాంగ విధానంలో కూడా మార్పులు చేసి ఆయనకు ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. అదానీతో కలిసి మోదీ ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఎయిర్ పోర్టులకు సంబంధించి ఎలాంటి అనుభవం లేని కంపెనీలకు వాటి డెవలప్ మెంట్ పనులు అప్పగించొద్దన్న రూల్ ను అదానీ కోసం కేంద్రం మార్చేసిందని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం అదానీ చేతిలో ఆరు ఎయిర్ పోర్టులు ఉన్నాయని.. అత్యంత లాభదాయకమైన ముంబై ఎయిర్ పోర్టును సైతం సీబీఐ, ఈడీలను ఉపయోగించి జీవీకే నుంచి లాక్కొని అదానీకి అప్పగించారని విమర్శించారు. డ్రోన్ల తయారీలో అనుభవం లేకపోయినా హెచ్ఏఎల్ ను కాదని అదానీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని అన్నారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టడం వెనుక కారణాలతో పాటు ఇప్పటి వరకు ఆయనకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తాను భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అదానీ పేరు మాత్రమే వినపడిందని రాహుల్ చెప్పారు. గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని, అదానీ మధ్య బంధం ఈ నాటిదికాదని.. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే వారు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2014లో మోడీ ఢిల్లీ పీఠం ఎక్కడం వెనుక అదానీ ఉన్నారన్నారు రాహుల్ గాంధీ.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×