Big Stories

Fish Brain:319 మిలియన్ ఏళ్లనాటి చేప మెదడుతో పరిశోధనలు..

Fish Brain:పురాతన తవ్వకాల్లో ఒక్కొక్క మన ఊహకు అందని విషయాలు కూడా కనుగొంటూ ఉంటారు ఆర్కియాలజిస్ట్‌లు. అలా దొరికిన వస్తువులు లేదా ప్రాణాలు ఎన్నో సంవత్సరాలు పరిశోధనలకు ఉపయోగపడుతుంటాయి. దాదాపు శతాబ్దం క్రితం దొరికిన ఓ చేప మొదడును మళ్లీ పరీక్షలు చేయాలని పరిశోధకులు నిర్ణయించారు. ఈ చేప దాదాపు 319 మిలియన్ సంవత్సరాల క్రితం దానిగా వారు గుర్తించారు.

- Advertisement -

చేపలు అనేవి ఎన్నో రకాలు ఉంటాయి. 319 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న వెన్నుముక ఉన్న చేప.. ప్రస్తుతం బోనీ ఫిష్‌గా రూపాంతరం చెందిందని దాని మెదడును స్టడీ చేసిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది సాల్మన్, గోల్డ్ ఫిష్ జాతికి కూడా చెంది ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని ఓ బొగ్గుగణిలో వందేళ్ల క్రితం ఈ చేపను గుర్తించారు. తాజాగా దీనికి రీ ఎగ్జామీన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

పరిశోధకులకు దొరికిన ఈ పురాతన చేప పేరు కోకోసెఫాలస్ విల్డి (సి విల్డి) అని వారు తెలిపారు. దీనిపై పరిశోధలను చేయడం ద్వారా న్యూరల్ అనాటమీ గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయని.. అంతే కాకుండా ప్రస్తుతం నీటిలో పెరుగుతున్న ఎన్నో రకాల చేపలు ఎలా పుట్టాయో తెలుస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని మెదడును స్టడీ చేయడం ద్వారా ప్రస్తుతం జీవిస్తున్న చేపల మెదడు కదలికలను కూడా గుర్తించే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.

ప్రస్తుతం వెన్నుముక ఉన్న చేపలు దొరకడం చాలా అరుదు. అందుకే దీని మెదడును జాగ్రత్తగా ఉంచి పరిశోధనలు నిర్వహించాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. వీటిని స్టడీ చేయడం ద్వారా బోనీ ఫిష్ ఎలా పుట్టిందో తెలుసుకోవచ్చని అనుకున్న శాస్త్రవేత్తలు.. ఇది కొంచెం కష్టమైన ప్రక్రియ అని అన్నారు. చేప అస్థిపంజరాన్ని కదిలించకుండా ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మెదడును ఎలా ఉంటుందో వారు తెలుసుకున్నారు. ఈ చేపలు అప్పట్లో నీటిలో ఉండే పురుగులను, సెఫాలొఫోడ్స్ లాంటివి తిని జీవించేవని వారు గుర్తించారు.

సి విల్డి ఫిష్ అనేది ఆరు నుండి ఎనిమిది అంగుళాల పొడవు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా దీని మెదడు ఒక అంగుళం పొడవు ఉండవచ్చని వారు అంటున్నారు. మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ చేప మరణించినా కూడా.. టిష్యూలు పాడయిపోయి వాటి స్థానంలో దట్టమైన ఖనిజాలు అన్ని చేరుకోవడంతో మెదడు ఇంకా అలాగే ఉందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇన్నాళ్లుగా ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ మ్యూజియంలో ఉన్న చేపను పరిశోధనల కోసం బయటకు తీశారు.

For More Live Updates :-

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News