BigTV English

Self Driving Apple Cars :సెల్ఫ్ డ్రైవింగ్ యాపిల్ కార్లు.. నిజమా..? అబద్ధమా..?

Self Driving Apple Cars :సెల్ఫ్ డ్రైవింగ్ యాపిల్ కార్లు.. నిజమా..? అబద్ధమా..?
Apple Cars


Self Driving Apple Cars : ఒక రంగంలో సత్తా చాటుకున్న సంస్థలు.. మరొక రంగంలోకి ఎంటర్ అవ్వాలి అనుకోవడం సహజం. అదే విధంగా ప్రస్తుతం ఉన్న లగ్జరీ కార్ బ్రాండ్స్‌కు పోటీ ఇవ్వడానికి యాపిల్ కూడా కార్లను లాంచ్ చేస్తుంది అని 2014లోనే రూమర్స్ బయటికి వచ్చాయి. అప్పటి నుండి ఇప్పటివరకు అసలు యాపిల్ కార్లను తయారు చేస్తుందా, చేయాలనే ఆలోచన ఉందా లేదా అనేది క్లారిటీ లేదు. అయినా కూడా మరోసారి యాపిల్ కార్ల గురించి వార్తలు వైరల్ అయ్యాయి.

యాపిల్ సంస్థ కార్లను తయారు చేస్తే ఎలా ఉంటుంది అని పలువురు ఆర్టిస్టులు డిజిటల్ ఆర్ట్‌ను వేసి చూపించారు. అవి చూసిన యాపిల్ ఫ్యాన్స్.. నిజంగానే ఆ సంస్థ కార్లను తయారు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అంతే కాకుండా యాపిల్ కేవలం ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేస్తుంది అంటూ కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై యాపిల్ ఏ విధంగా స్పందించలేదు. కాకపోతే యాపిల్ ఫ్యాన్స్ మాత్రం ఈ కార్లు మార్కెట్లోకి వస్తే.. టెస్లాను బీట్ చేస్తాయి అని నమ్మకంతో ఉన్నారు.


కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాదు.. యాపిల్ ఆటోనామస్ మోడ్‌తో పాటు కారును తయారు చేస్తుందంటూ రూమర్స్ బయటికి వచ్చాయి. 2021లో యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఆటోనామస్ కార్లపై చేసిన వ్యాఖ్యలే ఈ రూమర్స్‌కు కారణం. అయితే యాపిల్ కారు గురించి అడగగా.. ఆయన సరైన సమాధానాన్ని మాత్రం అందించలేదు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్.. ఇలా అన్ని రంగాల్లో తమ సత్తాను చాటాలి అనుకుంటున్నామంటూ టిమ్ కుక్ మాట దాటేశారు.

ఇప్పటివరకు యాపిల్ కార్లపై ఉన్న రూమర్స్‌కు మరిన్ని రూమర్స్ యాడ్ అయ్యాయి. ప్రస్తుతం చాలా లగ్జరీ కార్లకు ఉన్నట్టుగానే యాపిల్ కార్లకు కూడా రూఫ్‌పై సెన్సార్లు ఉంటాయని అనుకుంటున్నారు. అంతే కాకుండా యాపిల్ కార్ల తయారీని మొదలుపెట్టిందని, 2026 వరకు ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆటోనామస్ కారును మార్కెట్లో లాంచ్ చేయడం అంత సులభం కాదు కాబట్టి ఏ సమస్యలు రాకుండా యాపిల్ సన్నాహాలు చేస్తుందని చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×