BigTV English

Women’s Tears : ఆడవారి కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా..? షాకింగ్ నిజాలు..!

Women’s Tears : ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. చిన్నదాని ఓరచూపులకు చిత్తుకానీ మగాడు లేడు అంటారు. వాలు చూపులే కాదు.. ఆడవారి కన్నీళ్లకు ఉండే పవర్ గురించి తాజాగా ఓ ఆసక్తికర రిపోర్ట్ బయటకు వచ్చింది. సాధారణంగా ఆడవాళ్లు కన్నీరు కారిస్తే ఎంతటి మగాడికైనా చిరాకు వస్తుందట.

Women’s Tears : ఆడవారి కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా..? షాకింగ్ నిజాలు..!

Women’s Tears : ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. చిన్నదాని ఓరచూపులకు చిత్తుకానీ మగాడు లేడు అంటారు. వాలు చూపులే కాదు.. ఆడవారి కన్నీళ్లకు ఉండే పవర్ గురించి తాజాగా ఓ ఆసక్తికర రిపోర్ట్ బయటకు వచ్చింది. సాధారణంగా ఆడవాళ్లు కన్నీరు కారిస్తే ఎంతటి మగాడికైనా చిరాకు వస్తుందట. మరింత కోపానికి గురవుతారట. అదే సమయంలో మగాడి కోపాన్ని అంగీకరించని ఆడవారి కన్నీళ్లు కార్చేస్తుంటారు.


ఆడవారి కన్నీటిని ఇష్టపడని మగవాళ్లు.. ఆ కన్నీళ్ల వాసనకు మాత్రం బంధీలవుతారని అంటున్నారు. ఆడవారి కన్నీళ్లను పీలిస్తే ఎంతటి దూకుడుగా ఉండే మగవాడికైనా కళ్లాలు పడతయాని.. ఇజ్రాయెల్‌లోని వీజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

అందుకోసం శాస్త్రవేత్తలు ఇద్దరు ఆడవారిని వాలంటీర్లుగా తీసుకున్నారు. వారికి ముందుగానే ఇద్దరు మగవాళ్లతో కొన్ని రకాల గేమ్స్ ఆడమన్నారు. అనంతరం వారి డబ్బులను లాక్కుని మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చెప్పగానే మగవారి ప్రతీకార చర్య నెమ్మదిగా తగ్గిపోయినట్లు గుర్తించారు. ప్రతీకారం తీర్చుకోవాలన్న మగవారి కోరిక 43.7 శాతం వరకు తగ్గిపోయినట్లు గమనించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆ పురుషుల బ్రెయిన్ ఎమ్మారై స్కాన్ చేయగా.. ఆడవారి కన్నీళ్ల వాసన వారి మెదడుపై ప్రభావితం చేసి చురుకుదనం తగ్గించిందని వెల్లడించారు.


శిశువు పుట్టంగానే.. వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు వచ్చేలా ఏడుస్తారు. ఇక్కడ శిశువులు నిస్సహాయిలు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారు. అందుకు తగ్గట్టుగానే మన మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని కంట్రోల్ చేస్తుంది.

ఆడవారిని టర్చార్ పెట్టే నేరగాళ్లలో.. ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ కాస్త గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే ఆడవారి కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తించే నేరాగాళ్ల మెదడుని కన్నీళ్లు ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాయని శాస్త్రవేత్తలకు ఇంకా అర్థం కాలేదు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×