BigTV English
Advertisement

Social Media : సోషల్ మీడియాతో ఆరోగ్య సమస్యలు.. వీటికి పరిష్కారం ఇదే..

Social Media : ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా సోషల్ మీడియాతో ఇట్టే తెలిసిపోతుంది. కొందరు ఆదాయ మార్గంగా సోషల్ మీడియాను ఎంచుకుంటే.. మరి కొందరు బాగా టైమ్ ‌పాస్ చేస్తుంటారు. చాలా మంది వ్యక్తి గత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా బాగా షేర్ చేసుకుంటున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఉద్యోగంలో అవార్డులు పొందామని, కొత్త కారు కొన్నామని. కొత్త ప్రదేశానికి వెళ్లామని.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.

Social Media : సోషల్ మీడియాతో ఆరోగ్య సమస్యలు.. వీటికి పరిష్కారం ఇదే..

Social Media : ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా సోషల్ మీడియాతో ఇట్టే తెలిసిపోతుంది. కొందరు ఆదాయ మార్గంగా సోషల్ మీడియాను ఎంచుకుంటే.. మరి కొందరు బాగా టైమ్ ‌పాస్ చేస్తుంటారు. చాలా మంది వ్యక్తి గత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా బాగా షేర్ చేసుకుంటున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఉద్యోగంలో అవార్డులు పొందామని, కొత్త కారు కొన్నామని. కొత్త ప్రదేశానికి వెళ్లామని.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.


ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లలో చాటింగ్‌లు చేయడం, స్టేటస్‌లు చూడటం, రీల్స్ చూడటం అలవాటైపోతుంది. దీంతో అవి లేకుండా వారి ఫీలింగ్స్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

వీటికి అడిక్ట్ అయిపోయిన వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది. మానసికంగా ఆరోగ్యం క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే వీటికి దూరంగా ఉండటం ఎలానో తెలుసుకుందాం రండి.


కొందరు రోజుకు 5 నుంచి 6 గంటలకు పైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇంత సమయం మీరు సోషల్ మీడియాలో గడుపుతన్నారంటే అడిక్ట్ అవుతారు. మద్యం, సిగిరెట్ ఎలా వ్యసనంగా మారుతాయో సోషల్ మీడియా కూడా అంతే వ్యసనంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. లేదంటే మీ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

సోషల్ మీడియా అడిక్షన్‌ను వదిలించుకోవాలంటే.. రోజులో 1 గంట సమయం మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలని ధృడ నిశ్చయంతో ఉండాలి. వీలైతే కొన్ని రోజులు మానేయండి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మొబైల్ వాడకం చాలా డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో స్టేటస్‌లు చూడటం మానేయండి. ఇలా చేయడం వల్ల మీరు డిప్రెషన్‌కు దూరంగా ఉంటారు. క్వాలిటీ నిద్రను అనుభవిస్తారు.

సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే.. ఏదో ఒక సమయం వినియోగించడం అలవాటు చేసుకోండి. లంచ్ టైమ్‌ లేదా ఏదైనా అనుకూల సమయాన్ని ఎంచుకోండి. రోజు ఒకే సమయంలో వాడటం అలవాటు చేసుకోండి. తొలుత మీకు అలవాటు కావాలంటే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అవసరం అయితే ఆ యాప్స్‌ను ఫోన్ నుంచి తీసేయండి. దీని వల్ల సోషల్ మీడియా అడిక్షన్ కొంత వరకు తగ్గుతుంది. తర్వాత కొద్ది సమయం వినియోగించడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Note : మరో ముఖ్యమైన మాట మీ ఫీలింగ్స్‌ను ఎదుట వారితో నేరుగా పంచుకోండి.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×