IIIT Student Suicide: యూపీ, అలహాబాద్ లోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య(21)గా గుర్తించారు. చైతన్య అలహాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే తన బర్త్ డే ముందు రోజు సూసైడ్ చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
సంఘటనా స్థలంలో ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ, సూసైడ్ లెటర్ కానీ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే, పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే.. మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ట్రిపుల్ ఐటీ ఇనిస్టిట్యూట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో నివేదక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. పోలీసుల వివరాల ప్రకారం.. చైతన్య శనివారం రాత్రి 11:55 గంటలకు హాస్టల్ భవంతి ఐదో అంతస్తుపై నుంచి దూకాడు. గమనించిన ఇనిస్టిట్యూట్ సిబ్బంది వెంటనే తీవ్రంగా గాయపడిన చైతన్యను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చైతన్య మృతిచెందాడు. ఎగ్జామ్ లో ఫెయిల్ కావడంతో గత మూడు రోజుల నుంచి తీవ్ర నిరాశలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పేర్కొన్నారు. చైతన్య మృతి చెందిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చైతన్య తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. శనివారం రాత్రి చైతన్య నుంచి మెసేజ్ వచ్చిందని అతని తల్లి స్వర్ణలత తెలిపారు. తమ్ముడిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ చేసినట్లు ఆమె చెప్పారు. ఆ మెసేజ్ చూసిన వెంటనే తన కుమారుడికి కాల్ చేశానని.. కానీ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని ఆమె తెలిపారు. దీంతో వెంటనే వెంటనే తన ఫ్రెండ్ కు కాల్ చేశానని.. అతడు కనుక్కొని చెబుతానని… ఫోన్ కట్ చేశాడని అన్నారు. ఆ తర్వాత పది నిమిషాలకు అతడు కాల్ చేసి చైతన్యను ఆస్పత్రిలో జాయిన్ చేయించారని చెప్పారు. దీంతో చైతన్య తల్లి స్వర్ణలత పుట్టెడు దుఖంతో బోరున ఏడ్చారు.
అయితే, నిన్న మధ్యాహ్నం క్యాంపస్ కు చేరుకున్నాకే చైతన్య సూసైడ్ గురించి తెలిసిందని తల్లి స్వర్ణలత చెప్పారు. గత ఆరు నెలల నుంచి రాహుల్ చైతన్య క్లాసెస్ కు హాజరు కావడం లేదని ఇన్ స్టిట్యూట్ చెప్పిందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ఇన్ స్టిట్యూట్ యాజమాన్యం ఎప్పుడు తమకు మాత్రం చెప్పలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. టిఫిన్ సెంటర్ నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తామని వారు చెప్పారు. రాహుల్ చైతన్య క్లెవర్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చారు. చైతన్య జేఈఈ మెయిన్స్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించినట్టు వారు తెలిపారు.
ALSO READ: Weather News: రెండు తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. ఇక వర్షాలే వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన