PM Modi : చిన్న చిన్న విషయాలకూ ప్రత్యేకత చేకూర్చడంలో ప్రధాని మోదీ ఎక్స్‌పర్ట్. చప్పట్లు కొట్టడం, సెల్ఫీలు దిగడం నుంచీ.. జాతీయ జెండాను డీపీగా పెట్టే వరకు.. ఆయనేదైనా పిలుపు ఇచ్చారంటే అది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ కావాల్సిందే. అట్లుంటది మరి మోదీతోని.
మన్ కీ బాత్‌లో అలాంటిదే మరో ప్రతిపాదన చేశారు పీఎం మోదీ. పిల్లలను సమ్మర్ హాలిడేస్‌ను సరైన దిశగా నడిపించేలా పలు కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా చిల్డ్రెన్స్ కోసం ప్రత్యేకంగా ‘మై భారత్ క్యాలెండర్’ను ఆవిష్కరించారు. ఇందులో ఈ వేసవి సెలవుల్లో పిల్లలు, వారితో పాటు పేరెంట్స్ చేయదగ్గ పలు పర్యటనలు, చేపట్టదగిన కార్యక్రమాలను వివరించారు.
పిల్లలు, పేరెంట్స్.. హాలిడే మెమోరీస్
తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జన ఔషధి కేంద్రాలు’ ఎలా పనిచేస్తాయో వెళ్లి చూడాలని పిల్లలకు సూచించారు ప్రధాని మోదీ. ఇరుగు పొరుగు గ్రామాల్లో పర్యటించాలని.. అక్కడి కల్చరల్ ప్రొగ్రామ్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలని అన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు వాళ్లు చేసే పర్యటనలను #HolidayMemories అనే హ్యాష్‌ట్యాగ్‌తో వారి సెలవు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రధాని మోదీ కోరారు. రాబోయే ‘మన్ కీ బాత్’ ప్రోగ్రామ్స్‌లో కొంతమంది ఎంపిక చేసిన వారి అనుభవాలను తానే స్వయంగా దేశానికి చాటుతానని అన్నారు.
సమ్మర్‌లో పక్షుల కోసం..
సమ్మర్ సీజన్ ప్రారంభమైందని.. నీటిని పొదుపుగా వాడాలని, సంరక్షించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు పీఎం మోదీ. ‘క్యాచ్ ది రెయిన్’ ప్రోగ్రామ్ గురించి వివరించారు. కుదిరితే.. ఈ వేసవిలో ప్రతీ ఒక్కరు తమ ఇంటి ముందు ఒక కుండలో చల్లటి నీటిని బాటసారుల కోసం అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే, పక్షుల కోసం కూడా ఇంటి పైకప్పు, వరండాలో నీటిని ఉంచాలని అన్నారు. ఈ మంచి పని వళ్ల మీకు మంచే జరుగుతుందని ప్రధాని చెప్పారు.
ఇలా హాలిడేస్ సద్వినియోగం, నీటి పొదుపు, పక్షులకు నీటి ఏర్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో చేపట్టిన కొన్ని నీటి సంరక్షణా పద్దతులు, ప్రాజెక్టుల గురించి మన్ కీ బాత్ లో వివరించారు పీఎం మోదీ. అంబేద్కర్ జయంతి నాడు పాదయాత్రలో పాల్గొనాలని.. రాజ్యాంగ విలువల గురించి అవగాహనను వ్యాప్తి చేయాలని ప్రధాని మోదీ అన్నారు.