BigTV English

Superbug Bacteria : సూపర్‌బగ్ బ్యాక్టీరియా.. ఏఐ సాయంతో పరిష్కారం..

Superbug Bacteria : సూపర్‌బగ్ బ్యాక్టీరియా.. ఏఐ సాయంతో పరిష్కారం..

Superbug Bacteria : ఈరోజుల్లో ఎలాంటి వైరస్, ఎలాంటి బ్యాక్టీరియా ఎందుకు వ్యాపిస్తుంది అని విషయాలు తెలుసుకోవడం కష్టంగా మారింది. అందుకే వారి వ్యాప్తిని అరికట్టడం కూడా మరింత కష్టంగా ఉంటుంది. కానీ టెక్నాలజీ అనేది అడ్వాన్స్‌గా ఎంతో ముందుకు వెళుతుండడంతో ఇలాంటి బ్యాక్టీరియాను అరికట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఒక బ్యాక్టీరియాను అరికట్టడం కోసం వారు సన్నాహాలు మొదలుపెట్టారు.


ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది మనుషులకు ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది. ముఖ్యంగా మెడికల్ రంగంలో ఎన్నో రకాలుగా కొత్త కొత్త ట్రీట్మెంట్స్‌ను కనిపెట్టడంలో, పేషెంట్లకు చికిత్సను అందించే విషయంలో ఏఐ అనేది ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. అలాగే ప్రాణాంతకమైన బ్యాక్టీరియాగా పేరు తెచ్చుకున్న సూపర్‌బగ్‌కు యాంటీ బయాటిక్‌ను కనిపెట్టడానికి కూడా ఏఐ సాయమే తీసుకున్నారు శాస్త్రవేత్తలు. పైగా ఈ యాంటీబయాటిక్ పరిశోధనలు కూడా సక్సెస్ అయ్యాయని వారు బయటపెట్టారు.

సూపర్‌బగ్ అనేది శరీరంలో డ్రగ్స్‌ను పనిచేయకుండా ఆపగలిగే బ్యాక్టీరియా అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల లాంటి వాటిలో ఈ సూపర్‌బగ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రులలోని వెంటిలేటర్లు, బ్లడ్ కేథటర్స్ లాంటి పరికరాల్లో సూపర్‌బగ్ అనేవి కామన్‌గా కనిపిస్తుంటాయి. అందుకే వాటి నుండి పేషెంట్లను కాపాడడం కోసం శాస్త్రవేత్తలు ఈ యాంటీ బయాటిక్‌ను తయారు చేశారు. ఈ సూపర్‌బగ్ కారణంగా రక్తంలో ఇన్ఫెక్షన్స్, న్యుమోనియా వంటి వ్యాధులు వస్తాయని వారు తెలిపారు.


జీన్స్‌లో వ్యాపించే శక్తి సూపర్‌బగ్‌లో ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇది దానికి నేచురల్‌గా వస్తుందని అన్నారు. సూపర్‌బగ్‌ను కంట్రోల్ చేయడం కోసం శాస్త్రవేత్తలు తయారు చేసిన యాంటీబయటిక్‌ను ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఆ ప్రయోగాలు సక్సెస్ అవ్వడంతో త్వరలోనే మనుషులపై ఉపయోగించే విధంగా ఉంటుందని, అంతే కాకుండా ఆసుపత్రులలో సూపర్‌బగ్స్ బెడద పోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×