BigTV English

Kirti Kulhari : తాప్సీ పీఆర్ గేమ్ ను బయట పెట్టిన హీరోయిన్… తనను సైడ్ చేశారంటూ షాకింగ్ కామెంట్స్

Kirti Kulhari : తాప్సీ పీఆర్ గేమ్ ను బయట పెట్టిన హీరోయిన్… తనను సైడ్ చేశారంటూ షాకింగ్ కామెంట్స్

Kirti Kulhari  : ‘పింక్’ (Pink) మూవీ ప్రమోషన్ టైంలో తనను పక్కన పెట్టారంటూ హీరోయిన్ కీర్తి కుల్హరి (Kirti Kulhari) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాప్సి (Taapsee Pannu) మాత్రమే హైలెట్ అయ్యిందంటూ తాను ఆ సినిమా ప్రమోషన్ టైంలో ఎలా బాధపడిందో వెల్లడించింది. అమితాబ్ బచ్చన్ తర్వాత ఈ సినిమాలో మంచి గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్ తాప్సి మాత్రమే అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


తాప్సీ పన్ను పిఆర్ గేమ్

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు చాలామంది పీఆర్ ని మెయింటైన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఇలాంటి పీఆర్ గేమ్ స్ట్రాటజీ వల్ల గుర్తింపు విషయంలో తను చాలా బాధపడినట్టుగా వెల్లడించింది కీర్తి కుల్హరి. ప్రమోషన్స్ టైంలో తనకసలు విలువే ఇవ్వలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ “పింక్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు విచిత్రంగా అనిపించింది. అంతకు ముందు దాకా నేను సినిమా సినిమాల విషయంలో పరిశ్రమలో హోదా పరంగా నటినటుల్లో ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ పింక్ మూవీ చేస్తున్నప్పుడు దాన్ని ఒక ముగ్గురు అమ్మాయిల కథగా చూసాను. మేమందరం నటులం కాబట్టి కలిసే ఉన్నాము అని నమ్మాను. కానీ పింక్ నాకు బిగ్ స్టార్, చిన్న స్టార్ ట్రీట్మెంట్ లా ఫీల్ అయ్యేలా చేసింది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని అలా భావించేలా చేస్తారని నేను అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.


“ట్రైలర్లో బిగ్ బి, తాప్సీ మాత్రమే ఉండడంతో మొదట ఆశ్చర్యపోయాను. కానీ రచయిత సూజిత్ సినిమాలో ఇలా జరగదని ధైర్యం చెప్పారు. దీంతో సినిమా కోసం నేను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకొని, రావాల్సిన గుర్తింపు తప్పకుండా వస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను. కానీ మూవీ ప్రమోషన్స్ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ప్రమోషన్స్ లో కూడా అందరూ అమితాబ్ తర్వాత తాప్సిపైన ఫోకస్ పెట్టారు. ఇదంతా పీఆర్ గేమ్ అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే ముందుగా అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత తాప్సి ఇలా మారింది పొజిషన్. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను” అని వెల్లడించింది కీర్తి.

అయితే తాప్సి ఇలా కావాలని చేసిందా ? అనే ప్రశ్నకు, ఆమె అసలు దీన్ని గమనించలేదని క్లారిటీ ఇచ్చింది కీర్తి. పైగా తనతో బాగానే ఉందని, కానీ ఆమె పీఆర్ గేమ్ ను తాను కొంచెం పర్సనల్ గా తీసుకున్నానని కీర్తి చెప్పింది.

తెలుగులో రీమేక్ 

షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ‘పింక్’ సినిమా ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక రాజకీయ నాయకుడి కొడుకు చేతిలో దాడికి గురైన ముగ్గురు మహిళల కేసును వాదించే న్యాయవాదిగా నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ. 157 కోట్లు కలెక్షన్స్ రాబట్టి, కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను తమిళంలో ‘నెర్కొండ పార్వై’, తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×