BigTV English

Star Heroines : స్టేజ్ పైనే నిర్మాత పరువు తీసిన హీరోయిన్స్.. అస్సలు ఊహించి ఉండడు.

Star Heroines : స్టేజ్ పైనే నిర్మాత పరువు తీసిన హీరోయిన్స్.. అస్సలు ఊహించి ఉండడు.

Star Heroines : సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ టాక్ ఇన్ అందుకుంటే మాత్రం ఆ సినిమాలో నటించిన నటీనటులు తర్వాత సినిమాకి రెమ్యూనిరేషన్ పెంచుతున్నారు. ఒక హీరో హీరోయిన్లు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా మరో సినిమా తీయాలంటే భారీగానే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సినిమా మంచి టాక్ ని అందుకుంటుంది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేస్తుంది. దాంతో ఆ సినిమా కలెక్షన్స్ బట్టి హీరో హీరోయిన్లు రెమ్యూనరేషన్ ని పెంచమని అడుగుతున్నారు.. ఇక రీసెంట్ గా తమిళ స్టార్ విశాల్ హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరోయిన్స్‌గా రూపొంది మొన్న సంక్రాంతి కానుకగా తమిళ్‌లో వచ్చిన ‘మదగజరాజ’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ లో హీరోయిన్లు స్టేజ్ మీదనే నిర్మాత పరువు తీసేసినట్టు తెలుస్తుంది.


తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ సునామి సృష్టిస్తుంది.. మొదటి రోజునే దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందంటేమామూలు విషయం కాదు. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన మదగజరాజ సినిమా పూర్తి అయ్యి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. విడుదలకు కొన్ని అడ్డంకులు రావడంతో ఆగిపోయింది.. దాదాపు రెండేళ్లపాటు అప్పుడు ఇప్పుడు అంటూ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ సినిమాని వదిలేసారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు కూడా దాదాపు ఈ సినిమాని వదిలేసుకున్నారు. అలాంటి సమయంలో ఈ సినిమాని రీసెంట్గా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకొచ్చారు.

దాదాపుగా 12 ఏళ్ల వాయిదా తర్వాత విడుదలైన మదగజరాజ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం ఒక్క ప్రెస్ మీట్ తోనే ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేశారు. వారి నమ్మకం వృధాగా పోలేదు సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. సినిమాకు అనూహ్య స్పందన దక్కడంతో వెంటనే తెలుగులో విడుదల చేయడం కోసం రెడీ అయ్యారు. తెలుగులో హీరోయిన్స్ అంజలి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వచ్చి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. జనవరి 31న ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్స్ ను మొదలెట్టేసారు. ఈ సందర్బంగా హిరోయిన్లు నిర్మాతను స్టేజ్ మీదనే రెమ్యూనరేషన్ పెంచుతార అని అడగటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు, మీరు మాకు పారితోషికం ఏమైనా పెంచుతున్నారా అంటూ అడిగారు. అందుకు నిర్మాత సమయస్ఫూర్తితో తెలుగు కూడా సినిమా హిట్‌ అయితే కచ్చితంగా మీ ఇద్దరికీ పారితోషికం పెంచుతాను అన్నట్లుగా సమాధానం ఇచ్చారు.. నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని నిర్మాత అస్సలు ఊహించి ఉండరు. ఏదోలా మేనేజ్ చేశారు. ఇక తెలుగులో హీరో విషయాలకు మంచి మార్కెట్ ఉంది. తమిళ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ ని అందుకుంటుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి తెలుగులో ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో..


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×