BigTV English

OTT Movie : న్యాయం కోసం కోర్టులోనే ఆ పని చేయించే జడ్జి… మంత్రి భార్యను కూడా వదలని మహారాజు ఎవరంటే?

OTT Movie : న్యాయం కోసం కోర్టులోనే ఆ పని చేయించే జడ్జి… మంత్రి భార్యను కూడా వదలని మహారాజు ఎవరంటే?

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో భాషతో సంబంధం లేకుండా, కంటెంట్ బాగుండే ప్రతి సినిమాని చూడటానికి ఇష్టపడుతున్నారు. వీటిలో మలయాళం సినిమాలు ముందు వరుసలో ఉన్నాయనే చెప్పాలి. ఇప్పుడు వస్తున్న మలయాళం సినిమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్నాయి. ఒక ఫాంటసీ డ్రామా మూవీ డిఫరెంట్ స్టోరీ తో ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..


సన్ ఎన్ఎక్స్ టి (Sun NXT) లో

ఈ మలయాళం ఫాంటసీ డ్రామా మూవీ పేరు ‘మహావీర్యర్‘ (Mahaveer yar). 2022లో విడుదలైన ఈ మలయాళ ఫాంటసీ మూవీకి ఎం. ముకుందన్ రాసిన కథ ఆధారంగా అబ్రిడ్ షైన్ దర్శకత్వం వహించారు. దీనిని పౌలీ జూనియర్ పిక్చర్స్, ఇండియన్ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ మూవీలో నివిన్ పౌలీ, ఆసిఫ్ అలీ, శాన్వి శ్రీవాస్తవ, లాల్, సిద్దిక్ నటించారు. ‘మహావీర్యర్’ మూవీ 21 జూలై 2022న థియేటర్లలో విడుదలైంది. ఒక రాజు తన ఎక్కిళ్ళు ఆగడం కోసం చేసే ప్రయత్నాలతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ ఎన్ఎక్స్ టి (Sun NXT) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

18 శతాబ్దంలో ఒక మహారాజు తన మంత్రితో ఏ కల్మషం లేని ఒక అందమైన అమ్మాయిని తీసుకురమ్మని చెబుతాడు. వెయ్యి మంది భార్యలు ఉన్న రాజుకి మరొక అమ్మాయి కావాలంటూ, బయటకు వెళ్లి వెతకడం మొదలు పెడతాడు మంత్రి. మహారాజుకు ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. వాటిని ఆపడం కోసమే, అందమైన కల్మషం లేని అమ్మాయిని తీసుకు రమ్మంటాడు. అందమైన అమ్మాయి కన్నీళ్లు తాగితే ఆ ఎక్కిళ్ళు పోతాయని ఒక స్వామీజీ రాజుకు చెప్తాడు. మంత్రి భార్య కూడా చాలా అందంగా ఉంటుందని తెలిసి, ఆమెను కూడా తన దగ్గర తీసుకు రమ్మని చెప్తాడు. మంత్రి తన భార్యను కూడా అక్కడికి తీసుకు వస్తాడు. అయినా ఎక్కిళ్లు తగ్గకపోవడంతో, మరో అమ్మాయి కోసం మంత్రి బయలుదేరుతాడు. ఈ క్రమంలో దేవయాని అనే అమ్మాయి మంత్రికి కనబడుతుంది. అక్కడ ఉన్నవాళ్లను కొట్టి ఆ అమ్మాయిని తీసుకుపోతాడు. ఈ స్టోరీ గతంలో జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లో ఒక స్వామీజీ గుడి దగ్గర ఉంటాడు. గుడిలో దేవుడి విగ్రహం కనిపించడం లేదని అతని మీద కేసు పెడతారు. కోర్టుకు తీసుకువచ్చిన స్వామీజీ తను దొంగతనం చేయలేదని, చేసిఉంటే విగ్రహంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయే వాడినని చెప్తాడు.

అలా చెబుతున్న క్రమంలో తన మహిమతో గతంలోకి వెళ్లి, రాజు కేసును జడ్జిని పరిష్కరించమంటాడు స్వామీజీ. కోర్ట్ లో ఆ కాలంలో ఉన్నవాళ్ళు వస్తారు. కేసు విచారణ జరుగుతుంది. దేవయానిని తీసుకెళ్లిన రాజు ఆమెను కన్నీటి బొట్టుని కార్చమంటాడు. ఎంత ప్రయత్నించినా ఆమె కంటిలో ఒక చుక్క కన్నీరు కూడా రాదు. దేవయాని కేసులో అందరిని నిర్దోషులుగా చూపిస్తాడు జడ్జి. దేవయానిని కన్నీళ్లు కార్చమని చెప్తాడు. ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళల్లో నీళ్లు మాత్రం రావు. కోర్టులోనే ఆమెను బట్టలు లేకుండా నిలబెడతారు. అయినా కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు రావు. చివరికి దేవయాని కన్నీటి చుక్కను కారుస్తుందా? మహారాజు ఎక్కిళ్ళు ఆగిపోతాయా? దేవయాని పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘మహావీర్యర్’ (Mahaveer yar) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×