BigTV English

TATA : టాటా అభయహస్తం

TATA : టాటా అభయహస్తం

TATA : బడా సంస్థలైన ట్విట్టర్, అమెజాన్, మెటాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా బంపరాఫర్ ఇచ్చారు. ఎంతో అనుభవం ఉన్నా, ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి… జాగ్వార్ ల్యాండ్‌ రోవర్‌-JLRలో ఉద్యోగాలు ఇస్తానని రతన్ టాటా ప్రకటించారు. అమెరికా, బ్రిటన్, చైనా, ఇండియా, ఐర్లాండ్‌, హంగేరీల్లో… డిజిటల్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో సుమారు 800 మందికి పైగా ఉద్యోగుల నియామకం చేపట్టనున్నట్లు JLR వెల్లడించింది.


టాటా మోటార్స్ అనుబంధ విభాగమైన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌కు ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజంగా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి హైబ్రిడ్‌ వర్క్‌ను సైతం ఆఫర్‌ చేస్తూ JLR అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అభివృద్ధి చేస్తూ వారిని గైడ్‌ చేయడం, సంస్థలోని వివిధ విభాగాల్ని వర్గీకరిస్తూ… రా డేటాను ప్రాసెస్‌ చేసే అటానమస్‌ డ్రైవింగ్‌, ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలెక్ట్రిఫికేషన్, క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డెవలపింగ్‌, నెక్ట్స్‌ జనరేషన్‌ JLR కార్ల అభివృద్ధికి అవసరమైన బిల్డింగ్‌, రిపేరింగ్‌ వంటి విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు JLR ఓ ప్రటకనలో పేర్కొంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ ఫస్ట్ బిజినెస్‌గా రూపాంతరం చెందుతోందని… ఇప్పటిదాకా ఎవరూ చూడని కొన్ని అడ్వాన్స్‌డ్‌ వెహికల్స్‌ను తయారు చేయబోతున్నామని JLR వెల్లడించింది. డేటా, డిజిటల్‌ స్కిల్స్‌ ఆధారంగా వ్యూహాత్మకంగా 2025 నాటికి ఫస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లను, 2039 నాటికి కార్బన్‌ నెట్‌ జీరో కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని… JLR సీఈవో ఆంథోనీ బ్యాటిల్‌ చెప్పారు.
కార్లు కొనేవారికి లేటెస్ట్‌ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా… భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నామని తెలిపారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా అత్యంత నమ్మకమైన బ్రాండ్ అయిన టాటా… ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త జీవితం ఇస్తామని ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


    Related News

    Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

    Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

    Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

    James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

    Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

    Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

    Big Stories

    ×