E-Paper
Advertisement

Top 20 News: మతిస్థిమితం లేని తండ్రిని కొట్టి చంపిన కొడుకు, ప్రేమ వ్యవహారం చిచ్చు.. కత్తులతో పొడిచి..

Top 20 News: మతిస్థిమితం లేని తండ్రిని కొట్టి చంపిన కొడుకు, ప్రేమ వ్యవహారం చిచ్చు.. కత్తులతో పొడిచి..

1. కేసీఆర్‌కు ధీటైన కౌంటర్.. మంత్రి పొన్నం

కాంగ్రెస్ నేతలు కారు కూతలు కూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌ తోలును ప్రజలు అల్రెడీ తీశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ తోలును ప్రజలు తీస్తేనే ఫాంహౌస్‌కు పరిమితమైపోయారని విమర్శించారు.

2. అనుమతిస్తే చర్యలు

న్యూ ఇయర్ వేడుకలకు తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. వెస్ట్ జోన్‌లో ఉన్న పబ్‌లు, హోటల్స్, క్లబ్స్ ఓనర్స్‌తో మీటింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మైనర్‌లను పబ్‌లలోని అనుమతిస్తే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

3. రిపోర్ట్ సిద్ధం

GHMC వార్డుల డీలిమిటేషన్‌పై ఫిర్యాదుల అధ్యయనం పూర్తైంది. GHMCకి వచ్చిన 10 వేల అభ్యంతరాలను అధ్యయనం చేసి 70 నుంచి 80 డివిజన్‌ల పేర్లు, సరిహద్దులు మార్పు చేయాలని GHMC నిర్ణయం తీసుకుంది. అభిప్రాయాలు, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు రిపోర్ట్ సిద్ధం చేశారు.

4. బంద్ విజయవంతం

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పరిధిలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ విజయవంతమైంది. పోలవరం నియోజకవర్గాన్ని రంపచోడవరం జిల్లాలో కలిపి, ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని ఆదివాసి సంఘాలు తెలిపాయి.

5. పెద్దపులి సంచారం

పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. లింగాపూర్ పరిసరాల్లో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు పెద్దపల్లి ఫారెస్ట్‌లో పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. పొలాల దగ్గర రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

6. ప్రేమ వ్యవహారం చిచ్చు.. కత్తులతో పొడిచి

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌లో ప్రేమ వ్యవహారం చిచ్చు రేపింది. వట్టెపల్లికి చెందిన రిహాన్‌ను అతని స్నేహితులు శానవాజ్, మోహిజ్ కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ప్రస్తుతం రిహాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

7. అయోమయంలో గ్రామస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ టానాలో సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మృతి చెందిన చెర్ల మురళి ఎన్నికల్లో విజయం సాధించడంతో, నేడు ప్రమాణ స్వీకారానికి ఎవరూ లేక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

8. విక్రయిస్తే చర్యలు

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్ అన్నారు. చైనా మాంజా వల్ల మనుషులు, పక్షులు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాల నివారణకు భవిష్యత్తులో తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు.

9. ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలోనే మూడు పులులు సంచరిస్తున్నాయన్నారు. పులి కదలికలపై సిబ్బంది అప్రమత్తం చేశారు. కెమెరాలను, ట్రాప్లను ఏర్పాటు చేశారు. పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

10. నిందితురాలు అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఈస్ట్ బృందావన్ కాలనీలో శ్రీ ప్లే స్కూల్ నడుపుతున్న అశోక్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత తన భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని నమ్మబలికిన భార్య పూర్ణిమ, పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

11. పేకాటరాయుళ్లు అరెస్ట్

ఏలూరు జిల్లాలోని మాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. 281మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 130 కార్లు, 35లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ఏ1గా కిలారీ అప్పారావు, ఏ2గా కాట్రగడ్డ అశోక్, ఏ3గా చోదేళ్ల లక్ష్మణ్‌లపై కేసులు నమోదు చేశారు.

12. జంతు బలులపై యాక్షన్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతు బలులపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వైసీపీ శ్రేణులు బ్రహ్మసముద్రంలో బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లతో పొట్టేళ్లను బలిచ్చారు. రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొల్పేలా వ్యవహరించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

13. సిఐ పై కత్తితో దాడి

అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పుల కలకలం రేగింది. నిందితుడిని పట్టుకోడానికి వెళ్లిన టూ టౌన్ CI శ్రీకాంత్‌పై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్.. నిందితుడు అజయ్‌పై కాల్పులు జరపగా.. అజయ్ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

14. ట్యాంపరింగ్

కడప జిల్లా పులివెందుల మండలం కె.వెలమవారిపల్లెలో వైఎస్ సౌభాగ్యమ్మకు చెందిన 7 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు ట్యాంపరింగ్ చేశారు. ఆర్డీఓ విచారణలో ఈ అక్రమం నిజమేనని తేలడంతో, తదుపరి చర్యల కోసం ఆర్డీఓ జాయింట్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

15. మతిస్థిమితం లేని తండ్రిని కొట్టి చంపిన కొడుకు

మన్యం జిల్లా పాచిపెంట మండలం నేరాళ్లవలసలో కన్న తండ్రిని కుమారుడే కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని తండ్రి వేధింపులు భరించలేక కొడుకు సింహాచలం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు పాచిపెంట పోలీసులు కేసు నమోదు చేశారు .

16. మళ్లీ ప్రత్యక్షం

జెఫ్రీ ఎప్‌స్టీన్ కుంభకోణం ఫైల్స్ నుంచి మాయమైన డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ట్రంప్, ఆయన భార్య మెలానియా ఎప్‌స్టీన్‌తో ఉన్న ఫొటోలు మాయం కావడంపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అయితే, రివ్యూ కోసమే తాత్కాలికంగా వాటిని తొలగించామని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేస్తూ ఆ కీలక పత్రాలను పునఃప్రచురించింది.

17. 16 ఏళ్ల అనుబంధం

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు ఉన్నాయన్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. తాము అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తున్నామని, సిద్ధరామయ్యతో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. విభేదాలు కేవలం మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలేనని మండిపడ్డారు.

18. రామచందర్ ఆగ్రహం

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏపీ, తెలంగాణల్లో ఈ దాడులు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ దళితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

19. ఆశ్చర్యం వ్యక్తం

టీ20 ప్రపంచకప్‌ జట్టు నుంచి శుభ్‌మన్‌ గిల్‌ను తప్పించడంపై మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతని స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని విశ్లేషించారు.

20. పాత్రలకే ప్రాధాన్యత

సీనియర్ హీరోలతో నటించడంపై వస్తున్న విమర్శలకు ఆషిక రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. కథలో తన పాత్ర బలంగా ఉంటే హీరో వయస్సుతో సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. సీనియర్లతో నటించడం వల్ల అనుభవం దొరుకుతుందని, కేవలం వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×