E-Paper
Advertisement

Top 20 News Today: దారుణం.. తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య, తిరుమలలో తగ్గిన రద్దీ..

Top 20 News Today: దారుణం.. తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య, తిరుమలలో తగ్గిన రద్దీ..
Advertisement

1. రేపటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపులు.. సాగునీటి ప్రాజెక్టులపై నీళ్లు-నిజాలు పేరుతో ప్రభుత్వం ప్రత్యేక చర్చ చేపట్టనుంది. నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం పై, ఇతర విషయాలపై చర్చ జరగనుంది.

2. న్యూ ఇయర్‌ వేడుకలకు డ్రైవర్లకు హెచ్చరిక..

న్యూ ఇయర్‌ సందర్భంగా సీపీ సజ్జనార్‌ క్యాబ్‌ డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. మియా డ్రింక్ కియా అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్టీరింగ్‌కి సెల్యూట్ చేసి క్యాబ్‌ని నడపండని సూచించారు. గూగుల్‌లో లాయర్‌ కోసం కాదు.. క్యాబ్‌ అని సర్చ్‌ చేయమని సూచించారు. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనికీలు చేపట్టిన నేపథ్యంలో సజ్జనార్‌ ఆసక్తికర ట్వీట్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు.

3. హైదరాబాద్‌లో ముఠా గుట్టురట్టు

Advertisement

హైదరాబాద్‌లోని బోయినపల్లిలో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టైంది. మొత్తం నలుగురు పెడ్లర్స్‌, ఐదుగురు వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం దాదాపు 12 లక్షల 20 వేల రూపాయల విలువైన 45 గ్రాముల MDMA పౌడర్‌తో పాటు 6 గ్రాముల క్రిస్టల్ వైట్ MDMA డ్రగ్ పౌడర్, 13 గ్రాముల డ్రై గంజాయి, 2 కార్లు, 8 మొబైల్ ఫోన్లు, అయోనిక్స్ మినీ డిజిటల్ వెయిటింగ్ మెషిన్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

4. దారుణం.. తండ్రి మందలించడాన్ని విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్‌లోని బండ మైసమ్మ నగర్‌లో దారుణ ఘటన జరిగిన జరిగింది. బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన అరవింద్ అనే పదో తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

5. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి..

Advertisement

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులను మృతి చెందారు. NH 161 B విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన భారీ కల్వర్టు గుంతను.. పొగమంచు వల్ల గమనించక పోవడంతో.. బైక్ నేరుగా నీటి గుంతలో పడింది. దీంతో ఊపిరి ఆడక వారు మరణించారు.

6. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా మల్లేపల్లిలో వడ్డే నరసింహ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌‌లో నరసింహ మోడల్ పేరుతో చురుగ్గా ఉండే అతను.. తల్లి తిట్టడంతో మనస్తాపం చెంది మా అమ్మ వల్లే చనిపోతున్నాను అని వీడియో తీసి ఉరివేసుకున్నాడు. తల్లివల్లే నరసింహ చనిపోయాడని గ్రామస్తులు తల్లిపై దాడి చేశారు.

7. జయశంకర్ భూపాల పల్లి జిల్లా పెద్దపులి సంచారం..

జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి దాడిలో ఒక ఎద్దు మృతి చెందగా.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జడలపేట, గాంధీనగర్, భీష్మ నగర్, రామచంద్రపూర్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండి.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

8. హన్మకొండ జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

హన్మకొండ జిల్లాలో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాష్ డిస్పెన్సర్ షట్టర్లకు స్టీల్ బ్లేడ్లు అడ్డుపెట్టి.. బ్యాంక్ సెలవు రోజుల్లో 7 ఏటీఎంల నుంచి రూ.7.86 లక్షలు దోచుకున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రహమత్ నగర్, ఎక్సైజ్ కాలనీ వంటి రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసి ఈ కేటుగాళ్లు దోపిడీకి పాల్పడ్డారు.

9. తిరుమలలో తగ్గిన రద్దీ..

తిరుమలలో గత రెండు రోజుల తర్వాత రద్దీ తగ్గింది. వైకుంఠ ఏకాదశికి ముందస్తుగా లక్కీడిప్ ద్వారా అన్‌లైన్‌లో టోకన్లు ఇష్యూ చేశారు. దీంతో నేటి నుంచి జనవరి 8 వరకు దివ్వదర్శనం టోకన్ల జారీ జారీ ఆపేసారు. ప్రస్తుతం 16 కంపార్టమెంట్లలో భక్తులు ఉన్నారు.

10. స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేస్తున్నారు పోలీస్..

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ గిరిజన మహిళలకు.. స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సరళ్ కార్యక్రమం అమలు చేస్తున్నారు పోలీస్ అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ నిర్వహిస్తున్నారు.

11. రెండు ఆటోలు ఢీ.. స్పాట్‌లో 8 మంది..

విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్తపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజాం నుంచి తెర్లాం వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. వారిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

12. తీవ్రంగా పెరుగుతున్న చలి.. వణికిపోతున్న ప్రజలు..

అల్లూరి జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. లంబసింగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోవడంతో పొగమంచును ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యటకులు తరలివస్తున్నారు.

13. గుండె పోటుతో వ్యక్తి మృతి.. ఇంట్లోకి అనుమతించని ఓనర్..

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. గుండె పోటుతో చనిపోయిన మహబూబ్ బాష అనే వ్యక్తి మృతదేహాన్ని.. ఆయన ఉండే ఇంటి ఓనర్ ఇంట్లోకి అనుమతించలేదు. దాదాపు రెండు గంటల పాటు ఇంటి బయట అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని ఉంచారు. చివరకు పోలీసుల చొరవతో మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించాడు.

14. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

విజయనగరం జిల్లా గజపతినగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా గజపతినగరం వద్ద చెట్టును ఢీ కొట్టింది. మృతులు వైజాగ్‌కు చెందిన వినయ్, దినేష్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు జస్టిస్ మినీ పుష్కరణ, సినీ దర్శకుడు రమణ తేజ తమ కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో వారిని ఘనంగా సత్కరించారు.

16. తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0గా నమోదు

తైవాన్ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.0గా నమోదయింది. ఈశాన్య తీర ప్రాంతం యిలాన్‌కు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంతో రాజధాని తైపీలో ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

17. ఢీల్లీలో మోదీ విస్తృత చర్చలు

వికసిత భారత్‌ లక్ష్య సాధనలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన వ్యూహాలు, విద్య, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, పాలన, సంస్కరణలు తదితరాల పై విస్తృత చర్చలు దిల్లీలో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు దీనికి వేదికగా మారింది.

18. ఘోర రైలు ప్రమాదం..

బీహార్‌లో గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. సిములతాలా వంతెనపై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన పైనుంచి 19 బోగీలు కిందపడ్డాయి. టెల్వాబజార్‌ హాల్ట్ దగ్గర ఘటన జరిగింది. సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు.. ఆసన్‌సోల్‌ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి లోకోపైలట్‌, గార్డు బయటపడ్డారు.

19. టీమ్‌ఇండియా కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ రికార్డు

పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియా కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ రికార్డు గొప్పగా ఉంది. కానీ సేనా దేశాల చేతుల్లో పరాజయాలు.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్ ఓటముల తర్వాత గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ టెస్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగా తన బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నానని చెబుతూ లక్ష్మణ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

20. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. సినీరంగం, తన మాతృత్వపు ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ఒక ప్రాణాన్ని సృష్టించిన తన శరీరంపై గర్వంగా ఉందని.. టాక్సిక్‌ సినిమా చిత్రీకరణ సమయంలో గర్భవతిగా ఉండి కూడా ఎంతో కష్టపడి నటించానని తెలిపారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ వృత్తిపరంగా వార్ 2, గేమ్‌ఛేంజర్ వంటి చిత్రాలతో రాణిస్తున్నానని ఆమె వివరించారు.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×