వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో SIగా శంకర్‌ను నియమించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని యలల్, బషీరాబాద్‌లో మునుపు SIగా పనిచేసిన శంకర్‌పై కేసుల్లో పక్షపాత నిర్ణయాలు తీసుకుంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాద భరితుడుగా పేరుగాంచిన Siని పెద్దెముల్‌లో నియమించటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు IED నిపుణుడు టెక్ శంకర్ అలియాస్ మెట్టూరి జోగారావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నిన్న రాత్రి మృతదేహం కుటుంబానికి అప్పగించగా ఇవాళ ఉదయం స్వగ్రామం చేరింది. భారీ జనసమూహం, పౌరహక్కుల నేతలు, ప్రజానాట్యమండలి సభ్యులు విప్లవ వందనాలు అర్పించారు. పోలీసుల ఆధ్వర్యంలో శివసాగర్ బీచ్‌లో అంత్యక్రియలు జరిగాయి.
స్థానిక సంస్థలలో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు బీసీ విద్యార్థులు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య బీసీలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్స్ కల్పించిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాలన్నారు బీసీ విద్యార్థులు.
సీసీఐ అనేక నిబంధనలతో రైతుల పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రివ్యూలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు, రేషన్ డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిబడిన సంస్కృత పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. విద్యార్థులకు తయారు చేసిన కిచిడీని పరిశీలించారు. దీనిని కిచిడి అంటారా ఇలా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
ఒడిశాలో జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. 22 రాష్ట్రాల నుంచి 5,500 మంది పాల్గొనగా, తెలంగాణ 23 పాఠశాలల 580 మంది విద్యార్థులు 230 పతకాలు, 714 పాయింట్లతో రికార్డు సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.
పల్నాడు జిల్లా కారంపూడి పరిసరాల్లో నాగార్జునసాగర్ కుడి కాల్వకు అర్ధరాత్రి భారీ గండి పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఇరిగేషన్ ఎస్సీ కృష్ణ మోహన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నష్టాలను నివారించేందుకు అధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, FDC ఛైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. ప్రసాద్ ఐమాక్స్‌లో మీడియా సెంటర్‌తో పాటు మూవీ స్క్రీనింగ్‌ను ప్రారంభించిన తర్వాత కాసేపు సినిమా తిలకించారు గవర్నర్, మంత్రి. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ భాగంగా రెండు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది.
సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొంతమంది అధికారులు తమకేమీ పట్టనట్లు సెల్ ఫోన్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమైన సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మామ లక్ష్మీనారాయణపై ఫిర్యాదు అందింది. చెరువు మాన్యాన్ని కబ్జా చేశారని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వినతిపత్రం అందించారు పసుమర్రు గ్రామస్తుడు దశరథ రామయ్య. లక్ష్మీనారాయణ, కుటుంబ సభ్యులు పసుమర్రు గ్రామంలో 11 ఎకరాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా ఉత్తర్‌పల్లిలో తాగునీటి బోరు గురించి 6 గంటలుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టా యజమాని శ్రీనివాస్ రెడ్డి మోటారు తొలగించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఫెన్సింగ్ కూల్చి మోటారు పీకేశారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు నిరసనలు చేయగా అధికారులు, పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాలలో కోటక్ మహేంద్రా బ్యాంకు రికవరీ ఏజెంట్ అస్లాం రూ.40 లక్షలు మోసం చేశాడు. రైతుల నుంచి లోన్ మొత్తం తీసుకొని బ్యాంకులో కట్టకుండా ఉడాయించాడు. ఆగ్రహించిన రైతులు సిబ్బందిని లోపలే ఉంచి బ్యాంకుకు తాళం వేసి ఆందోళన చేశారు.
మెదక్ జిల్లా శివంపేటలో ట్రిపుల్ ఆర్ రోడ్ భూసేకరణకు ఎకరాకు రూ.16 లక్షల నోటీసులిచ్చేందుకు వచ్చిన ఆర్ఐ ప్రమోద్, జిపిటీ ప్రవీణ్‌లను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ఎకరా రూ.కోటి విలువ ఉంటే 16 లక్షలు ఇస్తామంటే ఒప్పుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనీల్ కుమార్ పోలీసు సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చజెప్పి అధికారులను విడిపించారు.
వైఎస్ వివేకా కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి. కేసును సీబీఐ దర్యాప్తు చేయక పోతే తనతోపాటు ఆదినారాయణ రెడ్డికి లింక్ పెట్టేవారన్నారు. ఇదే విషయం నాటి జిల్లా ఎస్పీ తనతో చెప్పినట్లు వెల్లడించారు. వివేకా కేసు విషయంలో ఆదేశాలు కూడా ఎస్పీకి వచ్చాయన్నారు. ఇక ఆదినారాయణరెడ్డి ఇంటికి పోవాలంటే తొలుత తనను దాటిపోవాలన్నారు. ఇళ్లల్లోకి చొరబడాలని చూస్తే తాడిపత్రి రాజకీయాలు కడపలో రిపీట్ అవుతాయని వైసీపీ నేతలను హెచ్చరించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో నోటీసులపై కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిశారు. తనకు మరింత గడువు కావాలని కోరారు. ఈనెల 23న తన వద్ద హాజరుకావాలని స్పీకర్ గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే గడువుకు ముందే స్పీకర్‌ను కలిశారు కడియం. వివరణ ఇవ్వడానికి తనకు మరింత సమయం కావాలని కోరారు. కడియం వినతిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు.
అల్లూరి జిల్లాలోని రంపచోడవరంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఇంకా తొమ్మిది మృతదేహాలు ఉంచారు. మొత్తం 13 మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం నలుగురికే పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్‌లో ఓ గ్లూగమ్ తయారుచేసే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ యజమాని పరారవగా.. మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఉగ్రవాద గ్రూపులు సోషల్ మీడియా వేదికగా యువతను ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అనుమానాస్పదంగా ఉన్న సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. దేశ రాజదానిలో నిఘా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.
దర్శకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో అల్లరి నరేష్. భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానని, ఆ మూవీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగేలా నిలిచిపోవాలన్నది తన కోరిక అని తెలిపాడు. కాగా నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన 12A రైల్వే కాలనీ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా దూరమయ్యే అవకాశాలున్నాయి. గిల్ ఫిట్‌నెస్‌పై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిల్ ఆడకపోతే రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే అతడికి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. గిల్ కోలుకోవడానికి ఇంకా పది రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం.