Women Drown Swimming Pool| సరదాగా పికినిక్ కోసం రిసార్ట్‌కు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు అందరూ మరణించారు. ప్రమాదంలో ఉన్న ఒకరిని కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు కూడా చనిపోయారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. చనిపోయిన ముగ్గురూ ఇంజినీరింగ్ విద్యార్థినులు కావడం వారి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో ఇంజినీరంగ్ చదువుకున్న ముగ్గురు స్టూడెంట్స్ నిషిత (21), పార్వతి (20), కీర్తన (21) ఆదివారం నవంబర్ 17, 2024న మంగళూరు నగరానికి విహార యాత్రకు వెళ్లారు. ఇందులో భాగంగానే మంగళూరులోని వాజ్కో బీచ్ రిసార్ట్ కు వెళ్లి అక్కడి స్విమ్మింగ్ పూల్ లో దిగారు. అయితే వారెవరికీ స్విమ్మింగ్ (నీటిలో ఈదడం) తెలియదు.
ఈత తెలియకపోయినా స్విమ్మింగ్ పూల్ లో దిగి అందులో తక్కువ నీరు ఉన్న ప్రాంతంలో కాసేపు సేదదీరుతూ ఉన్నారు. ఆ సమయంలో రిసార్ట్ సిబ్బంది ఎవరూ అక్కడ లేరు. ఈ క్రమంలో పార్వతి.. స్విమ్మింగ్ పూల్ లో నీరు లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కానీ ఆ తరువాత అక్కడి నుంచి రాలేకపోయింది. ఆమె ఈత తెలియకపోవడంతో మునిగిపోతూ కాపాడమని అరచింది. అయితే మిగతా ఇద్దరు.. నిషిత, కీర్తనకు కూడా స్విమ్మింగ్ రాదు. అయినా తమ స్నేహితురాలిని కాపాడడానికి నిషిత ముందడగు వేసింది. కానీ నిషిత కూడా పార్వతి వద్దకు చేరుకునే క్రమంలో నీటిలో మునిగిపోతూ కాళ్లూ చేతులూ ఆడిస్తూ ఇబ్బందులు పడుతోంది. ఆమె తిరిగి రాలేకపోతోంది.
Also Read: పెళ్లిలో అతిథులపై కారు ఎక్కించేసిన వరుడి బంధువు.. టివి రిమోట్ ఇవ్వలేదని హత్య
ఇది గమనించిన కీర్తన చివరికి ఆమె కూడా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పూల్ లోని రెండు ట్యూబ్‌లను అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ కీర్తన ఆ ట్యూబ్‌ల వరకు చేరుకోలేకపోయింది. అలా ఆమె కూడా నీటిలో మునిగిపోయింది. కీర్తన ట్యూబ్ వరకు చేరుకొని ఉంటే కనీసం ఆమె అయినా తన ప్రాణాలు కాపాడుకునేది. కానీ అలా జరగలేదు. ముగ్గరు ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుకునే యువతులు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన సిసిటీవిలో రికార్డ్ కావడంతో పోలీసులు రిసార్ట్ యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్విమ్మింగ్ పూల్ వద్ద ఒక లైఫ్ గార్డ్ ఉండడం తప్పనిసరి. బీచ్ రిసార్ట్ ఈ నియమాన్ని పాటించలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ చెప్పారు. రిసార్ట్ యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పండుగకు డిజైనర్ లెహంగా కొనివ్వలేదని ఆత్మహత్య
మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లోని బలియా జిల్లా భులాయి గ్రామంలో ఒక టీనేజర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నీలం అనే 13 ఏళ్ల అమ్మాయి.. దీపావళి సమయంలో ఛట్ పూజా రోజు తనకు ఒక డిజైనర్ లెహంగా కావాలని తన స్నేహితులందరూ ఆ రోజు ఖరీదైన లెహంగా వేసుకొని వస్తున్నారని ఆమె తన తల్లితో అడిగింది. కానీ ఆర్థిక సమస్యల వల్ల నీలం తల్లి ఆమెకు లెహంగా కొనివ్వలేదు. ఈ కారణంగా తల్లితో ఆమె పండుగ రోజు నుంచి ముభావంగా ఉండేది. తన స్నేహితుల లాగా తనకు కూడా ఖరీదైన బట్టలు వేసుకోవాలని ఆమె ఆశపడింది. కానీ తన కోరిక తీరనందుకు ఆమె ఇక పేదరికంలో జీవించలేనని లేఖ రాసి రెండు రోజుల క్రితం ఉరి వేసుకొని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నీలం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.