BigTV English

Tornado’s can detected:- స్మార్ట్ ఫోన్ల సాయంతో టొర్నాడోను కనిపెట్టవచ్చు..!

Tornado’s can detected:- స్మార్ట్ ఫోన్ల సాయంతో టొర్నాడోను కనిపెట్టవచ్చు..!

Tornado’s can detected:- ఫారిన్ దేశాల్లో ఎక్కువగా వచ్చే ప్రకృ తి విపత్తుల్లో టొర్నాడో ఒకటి. అంటే సుడిగాలి అని అర్థం. ఈ టొర్నాడో ఎక్కువగా అమెరికాలాంటి దేశాల్లో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి దీని తీవ్రత ఎక్కువగా లేకపోయినా.. ఒక్కొక్కసారి మాత్రం ఎంతోమంది ప్రాణాలను బలిదీసుకుంటుంది ఈ టొర్నాడో. అయితే ఈ టొర్నాడో వచ్చే సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.


టొర్నాడో అనేది ఎప్పుడు, ఎక్కడ వస్తుందో తెలియదు. కానీ అది ఒకచోటలో ప్రారంభమైన తర్వాత, అది మన దిశగా వస్తుందా లేదా వేరే దిశగా వెళ్తుందా అని కనిపెట్టడం కోసం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తే చాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. టొర్నాడో దిశను కనుక్కోవడానికి ప్రస్తుతం టెక్నాలజీ ఉన్నా కూడా అది ఏ దిశగా కదులుతుందో కరెక్ట్‌గా చెప్పడం మాత్రం కష్టమయిపోతుంది.

రాడార్ లాంటి టెక్నాలజీలు ఈ విషయంలో పనిచేస్తున్నా కూడా టొర్నాడో రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్టార్మ్ స్పాటర్స్ అందుబాటులో ఉండాలి. అలా లేకపోతే టొర్నాడో రాకను కనుక్కోవడం కష్టమే. పైగా టొర్నాడో చాలా దగ్గరలో ఉన్నప్పుడు రాడార్ సాయంతో కనుక్కొని ప్రజలను వెంటవెంటనే ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టమైన విషయం.


రాడార్ అనేది టొర్నాడోలను కనిపెట్టదని, ఇది ప్రకృ తి విపత్తులను కనుక్కోవడంలో పనిచేసినా టొర్నాడోను మాత్రం కరెక్ట్‌గా కనిపెట్టే అవకాశం ప్రతీసారి ఉండదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే మనుషులకు వినిపించని ఓ ఇన్‌ఫ్రా సౌండ్ టెక్నాలజీ ద్వారా టొర్నాడోను కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

శబ్దతరంగాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు వాటి ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. అయితే టొర్నాడోను కూడా ఇలాంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సౌండ్ సెన్సార్లను 12 వాల్ట్ బ్యాటరీలతు, సోలార్ ప్యానెల్స్, కేబుల్స్ సాయంతో తయారు చేయవచ్చని, త్వరలో ఈ విభాగంలో పనులు మొదలుకానున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×