Twitter: నష్టాలు భరించలేకే ట్విట్టర్ నుంచి సగం మంది ఉద్యోగుల్ని తీసేశానంటున్నాడు… కొత్త బాస్ మస్క్. రోజుకు 4 మిలియన్ డాలర్లు నష్టం వస్తోందని… మరో దారి లేకే ఉద్యోగుల్ని తీసేయాల్సి వచ్చిందని ప్రకటించాడు. కానీ… తీసేసిన ప్రతి ఉద్యోగికి 3 నెలల వేతనం ఇస్తున్నామని… చట్ట ప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా 50 శాతం ఎక్కువే ఇచ్చామని తెలిపాడు.
ట్విట్టర్ ఆదాయం తగ్గడానికి సామాజిక కార్యకర్తలే కారణమని మండిపడ్డ మస్క్… వాళ్లు అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నాశనం చేశారని ఆరోపించారు. కంటెంట్ నియంత్రణ యథావిధిగానే ఉన్నా… ప్రకటనలు ఇచ్చే వాళ్లపై ఒత్తిడి తెచ్చి వాటిని నిలిపి వేయించారని, అందుకే ట్విట్టర్ ఆదాయం భారీగా పడిపోయిందన్నాడు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు. ట్విట్టర్లో 7,500 మంది ఉద్యోగులు ఉంటే… ఇప్పటికే 3,738 మందికి లే ఆఫ్ ఈ మెయిల్స్ పంపామని మస్క్ చెప్పాడు. భారత్‌లోనూ ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇచ్చాడు మరోవైపు… లే ఆఫ్‌లకు ముందు ఉద్యోగులు, యూజర్ల డేటాను భద్రంగా ఉంచడం కోసం… ట్విట్టర్ అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయబోతున్నాడు… మస్క్.
మరోవైపు ట్విట్టర్ ను కొన్న మస్క్ పై ఫైరయ్యారు… అమెరికా అధ్యక్షుడు బైడెన్. అసత్య ప్రచారాలతో ప్రపంచమంతా విషం చిమ్ముతున్న ట్విటర్‌ను కొనడం విచారకరమన్నాడు. మూడు రోజుల్లో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల కోసం… చికాగో జరిపిన నిధుల సమీకరణ కార్యక్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.