BigTV English

Vaikunta Ekadasi Darshan Tickets: ఆఫ్ లైన్ లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఎప్పుడంటే….

Vaikunta Ekadasi Darshan Tickets: ఆఫ్ లైన్ లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఎప్పుడంటే….

Vaikunta Ekadasi Darshan Tickets: నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన మొత్తం 2.20 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో శనివారం అందుబాటులో ఉంచగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రారంభమైన 40 నిమిషాల్లోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఇది తెలియక భక్తులు గంటల తరబడి వెబ్‌సైట్‌లో టిక్కెట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాల ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 2 న వైకుంఠ ఏకాదశి, 3 న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది


జనవరి 1వ తేదీ రద్దీ ఉంటుందనే అంచనాలతో టీటీడీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే బ్రేక్ దర్శనాల సమయాల్లో మార్పులు చేసిన టీటీడీ..జనవరి 1 కొత్త సంవత్సరం రద్దీ వేళ మరి కొన్ని నిర్ణయాలు అమలు చేయనుంది. వీఐపీలు నేరుగా వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం కేటాయించనుంది. సిఫార్సు లేఖలు తీసుకోకూడదని ప్రకటించింది. జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గత సంప్రదాయాల మేరకు కొనసాగించనుంది.తిరుమల శ్రీవారిని ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తుల రద్దీ ఉంటుంది. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.


Tags

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×