BigTV English
Advertisement

WhatsApp : వాట్సాప్ తాజా అప్ డేట్ లో కొత్తగా 5 అదిరిపోయే ఫీచర్లు

WhatsApp : వాట్సాప్ తాజా అప్ డేట్ లో కొత్తగా 5 అదిరిపోయే ఫీచర్లు

WhatsApp : వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లతో సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. అతి త్వరలో ఐదు కొత్త ఫీచర్లను చూడబోతున్నారు. వీటిలో చాలావరకు బీటావర్షన్ యూజర్లకు మాత్రమే మొదట అందుబాటులోకి రానున్నాయి.


కొత్త ఫీచర్లు : 1.ఇమేజ్ బ్లర్ టూల్ 2.ఫార్వర్డ్ మీడియా క్యాప్షన్స్ 3.గ్రూప్ చాట్ లో ప్రొఫైల్ ఫొటో 4.మెసేజ్ యువర్ సెల్ఫ్ 5. డెస్క్ టాప్ మీడియా ఆటో డౌన్ లోడ్

ఇప్పుడు ఈ ఐదింటి గురించి వివరంగా తెలుసుకుందాం.


  1. ఇమేజ్ బ్లర్ టూల్ :
    మనం పంపించాలనుకున్నా… మనకు వచ్చిన ఫొటోల్లో కొన్ని ఇబ్బందికరంగా ఉండొచ్చు. అవి పిల్లలు, ఇతరులకు పూర్తిగా కనిపించకుండా వాటిని బ్లర్ చేయొచ్చు. అంటే ఫొటో షాప్ లో, వీడియో ఎడిటింగ్ లో ఎలాగైతే బ్లర్ చేస్తామో అలాగే అన్నమాట.
  2. ఫార్వర్డ్ మీడియా క్యాప్షన్ :
    వాట్సాప్ బీటా వర్షన్ అప్ డేట్ 2.22.24.2లో ఫార్వర్డ్ మీడియా క్యాప్షన్ అనే కొత్త ఫీచర్ ను తీసుకురానుంది వాట్సాప్. ప్రస్తుతం మనం ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేయాలంటే మీడియాను, క్యాప్షన్లను వేర్వేరుగా ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇకముందు అలాంటి సమస్య లేకుండా ఒకేసారి మీడియాతోపాటు క్యాప్షన్లను ఫార్వర్డ్ చేయొచ్చు. అయితే ఈ ఫీచర్ వాట్సప్ యూజర్లు అందరికీ ప్రస్తుతం అందుబాటులో ఉండదు.
    3.గ్రూప్ చాట్ లో ప్రొపైల్ ఫొటో :
    వాట్సాప్ త్వరలో ఈ ఫీచల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే అందరికీ కాదు… మొదట బీటా యూజర్లకు మాత్రమే. గ్రూప్ చాట్ లో మనం చాట్ చేసే యూజర్ల గురించి తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడా అవసరం ఉండదు. చాట్ చేస్తున్నప్పుడే చాట్ బబుల్ పక్కనే ప్రొఫైల్ ఫొటోలు కనిపిస్తాయి.
    4.మెసేజ్ యువర్ సెల్ఫ్ :
    ఇదివరకే ఉన్న ఈ ఫీచర్ ను మరింత సరళతరం చేయనున్నారు. మనకు అతిముఖ్యమైన మెసేజ్ లను దాచుకోవాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి లేదంటే సొంత నెంబర్ ని మరో పేరుతో సేవ్ చేయాలి. కొత్తఫీచర్ వస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. అయితే ఇది కూడా బీటా వర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది.
  3. డెస్క్ టాప్ మీడియా ఆటో డౌన్ లోడ్ :
    వాట్సాప్ మొబైల్ వర్షన్ లో మీడియా ఆటోడౌన్ లోడ్ ఆప్షన్ ఉంది. త్వరలో డెస్క్ టాప్ లో కూడా ఇలాంటి ఆప్షన్ అందుబాటులోకి రానుంది. విండోస్, మ్యాక్ ఓయస్ డెస్క్ టాప్ లలో మీడియా ఆటో డౌన్ లోడ్ ఆప్షన్లు రానున్నాయి.

–సాయికళ

Tags

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×