E-Paper
Advertisement

చలికాలంలో ఏదో పోగొట్టుకున్నట్లు, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయా? మళ్లీ యాక్టివ్‌గా ఉండేందుకు టిప్స్

చలికాలంలో ఏదో పోగొట్టుకున్నట్లు, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయా? మళ్లీ యాక్టివ్‌గా ఉండేందుకు టిప్స్
Advertisement

Winter Blues| చలికాలం వచ్చిందంటే చాలు.. ఉదయం మంచం దిగాలనిపించదు. రోజంతా దుప్పటి కప్పుకొని ఉండాలని అనిపిస్తుందా? చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తోందా? ఎప్పుడూ అలసటగా, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకుండా ఉంటున్నారా? అయితే మీరు వింటర్ బ్లూస్ సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు. చలికాలంలో పగటి సమయం తగ్గడం, సూర్యరశ్మి తక్కువగా అందడం వల్ల కొందరిలో మానసిక స్థితి మారుతుంది. మరికొందరిలో ఈ సమస్య సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (SAD) రూపం దాల్చవచ్చు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1. వింటర్ బ్లూస్, SAD మధ్య తేడా ఏమిటి?

చలికాలంలో కొద్దిగా బాధ, చిరాకు, అలసట, పనులపై ఆసక్తి తగ్గడం వంటివి వింటర్ బ్లూస్ లక్షణాలు కావచ్చు. సాధారణంగా ఇవి స్వల్పంగా ఉంటాయి. రోజువారీ పనులపై పెద్దగా ప్రభావం చూపించవు.

Advertisement

అయితే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (SAD) అనేది ఒక రకమైన డిప్రెషన్. ఇది సాధారణంగా కొన్ని ప్రత్యేక సీజన్లలో కనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో నిరంతర విచారం, ఇష్టమైన పనులపై ఆసక్తి తగ్గడం, ఎక్కువ నిద్రపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆకలి పెరగడం, బరువు పెరగడం, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం కూడా లక్షణాలే. ఇలాంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.

2. తక్కువ సూర్యరశ్మి మూడ్‌

చలికాలంలో పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ ప్రభావితమవుతుంది. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. వెలుతురులో వచ్చే మార్పులు సెరోటోనిన్, మెలటోనిన్ వంటి రసాయనాల పనితీరును ప్రభావితం చేయవచ్చు. సెరోటోనిన్ మూడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెలటోనిన్ నిద్రకు సంబంధించిన హార్మోన్. వీటిలో మార్పుల వల్ల అలసట, నిద్ర సమస్యలు, మూడ్ మార్పులు రావచ్చు.

3. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం

Advertisement

చలి ఎక్కువగా ఉండటంతో చాలామంది బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. వాకింగ్, వ్యాయామం చేయడం కూడా తగ్గిస్తారు. దీనివల్ల శరీరంలో చురుకుదనం తగ్గి నీరసం పెరగవచ్చు. కాబట్టి చలికాలంలో కూడా రోజూ కొంతసేపు శారీరక వ్యాయామం చేయాలి.

4. ఉదయం కొద్దిసేపు ఎండలో గడపండి

ఉదయం వీలైనంతసేపు సహజమైన వెలుతురులో గడపడానికి ప్రయత్నించండి. కొద్దిసేపు నడవడం లేదా ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోండి. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర తీసుకోండి.

5. రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు, నట్స్, ప్రొటీన్లు ఉండేలా చూసుకోండి. స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం తగ్గించండి.

Also Read: క్షుద్రపూజ గ్రామం.. వందల ఏళ్లుగా భయానక ప్రదేశంగా ప్రసిద్ధి.. పర్యటించడానికి ధైర్యముందా?

6. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపండి

మూడ్ బాగోలేనప్పుడు ఒంటరిగా ఉండిపోకండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడండి. మీ మనసులోని భావాలను వారితో షేర్ చేసుకోండి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వంట చేయడం, మొక్కల పెంపకం వంటి పనులకు సమయం కేటాయించండి.

Also Read: ఆత్మవిశ్వాసమే అతని ఆయుధం.. కళ్లు కనిపించకపోయినా ఎవరెస్ట్ ఎక్కేశాడు

చిన్న మార్పులతో వింటర్ బ్లూస్‌ ఎదుర్కోవచ్చు

చలికాలంలో వచ్చే మూడ్ మార్పులు నిర్లక్ష్యం చేయకండి. సరైన నిద్ర, వ్యాయామం, మంచి ఆహారం, ఉదయం వెలుతురు వంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వండి. అయితే బాధ ఎక్కువకాలం కొనసాగినా, రోజువారీ పనులకు ఆటంకం కలిగించినా మానసిక ఆరోగ్య నిపుణులు సంప్రదించండి. అవసరమైనప్పుడు సరైన వైద్య సహాయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Related News

Friday OTT Releases : ఓటీటీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఏకంగా 10 స్ట్రీమింగ్..!

Podarillu Today Episode : మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. కన్నాను కాపాడిన నారాయణ.. చక్రికీ షాక్..

Intinti Ramayanam Today Episode: రమ్య దెబ్బకు షాక్.. పాపం ప్రణతి.. రమ్యకు అన్యాయం..?

‘రామాయణ’ పై వర్మ రివ్యూ… మొరిగే కుక్కలంటూ !

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Big Stories

Advertisement
×