BigTV English

womens saftey : ఈ గాడ్జెట్స్ మహిళలకు రక్షా కవచం

womens saftey : ఈ గాడ్జెట్స్ మహిళలకు రక్షా కవచం

womens saftey : మహిళలపై రోజురోజుకు దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించే రాక్షసుల సంఖ్య పెరిగిపోతోంది. కఠిన శిక్షలు పడుతున్నా నేరస్థుల తీరు మాత్రం మారడం లేదు. నేరాలు కూడా ఆగడం లేదు. మరి దీనికి పరిష్కారమేంటి? గత ఎన్నో ఏళ్లుగా మేథోమథనం జరుగుతూనే ఉంది. అయినాసరే మహిళలకు భద్రత అనేది గాల్లో దీపంగానే మారింది. ఇలాంటి సమయంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. నిర్భయ బ్రేస్ లెట్, బర్డ్ ఐ, ది రోడ్ ఐడీ బ్రేస్ లెట్, ది గార్డెడ్ రింగ్ వంటి గాడ్జెట్స్ మహిళలకు రక్షా కవచంగా మారాయని చెప్పొచ్చు. నిర్బయ కేసు దేశంలో సంచలనం స్రుష్టించింది. నిర్భయ దోషుల్లో నలుగురికి ఉరిశిక్ష కూడా పడింది. ఇక నిర్భయ పేరుతో బ్రేస్ లెట్ తయారు చేశారు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్. గోరఖ్ పూర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన స్నేహ, అక్షితలు ఈ గాడ్జెట్ ని రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మహిళల భద్రతకు నిర్భయ బ్రేస్ లెట్ ఎంతగానో ఉపయోగపడనుంది. దీన్ని ఉమెన్ సేస్టీ యాప్ నకు అనుసంధానం చేస్తారు. దీంతోపాటు ఐదు నెంబర్లతో కనెక్టివిటీ ఉంటుంది. ఇక మహిళలకు పర్సనల్ సేఫ్టీ అలారమ్ కు సంబంధించింది బర్డ్ ఐ. ఎప్పుడూ దీన్ని వెంట తీసుకెళ్లొచ్చు. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే దీన్నుంచి పెద్ద సౌండ్, లైట్ వెలువడి అటాకర్ ని భయపెడుతుంది. అదేసమయంలో చుట్టుపక్కలవారు ఆదుకునేలా చేస్తుంది. ది రోడ్ ఐడీ బ్రేస్ లెట్ అనేది మహిళలకు మరో సేఫ్టీ గాడ్జెట్. ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదావశాత్తు కిందపడినా, ప్రమాదానికి గురైనా… దీన్ని వాడుకోవచ్చు. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ని అలర్ట్ చేస్తుంది ఈ బ్రేస్ లెట్. ది గార్డెడ్ రింగ్ కూడా మహిళల రక్షణకు ఉపయోగపడే గాడ్జెటే. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ రింగ్ లో అమర్చిన పదునైన బ్లేడ్ ను ఆపద సమయంలో ఉపయోగించుకుని తమనితాము కాపాడుకోవచ్చు. వీటితోపాటు మహిళల రక్షణకు ఉపయోగపడే మరికొన్ని గాడ్జెట్స్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×