White Hair: మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రంగు మారిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా మంది రకరకాల కలర్స్ వాడుతుంటారు. ఇంకోందరు షాంపూలను కూడా ట్రై చేస్తుంటారు. వీటితో ఫలితం మాత్రం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం ముఖ్యం. వీటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా వీటిని వాడితే తక్కువ సమయంలోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. మరి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి హోం రెమెడీస్ ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టును నల్లగా చేయడానికి రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీని వల్ల జుట్టు నల్లగా కనిపించినా, త్వరలోనే తెల్లగా మారుతుంది. అందుకే ఇంట్లోనే జుట్టును నల్లగా మార్చే పదార్థాలు వాడటం మంచిది.
1.అల్లం, తేనె:
అల్లం , తేనె మిశ్రమం జుట్టును నల్లగా మార్చడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం అల్లం తురుమును తీసుకుని అందులో కాస్త తేనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించాలి. 20-30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఈ ప్రక్రియ వారానికి కనీసం రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
2.కొబ్బరి నూనె, నిమ్మరసం:
కొబ్బరి నూనె జుట్టును సహజంగా బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి, జుట్టు మీద మసాజ్ చేయండి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు చాలా వరకు తగ్గుతుంది.
3.ఉల్లిపాయ రసం:
తెల్ల జుట్టును తగ్గించడానికి ఉల్లిపాయ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్‌లో ఉల్లిపాయ రసం , నిమ్మరసం మిక్స్ చేసి, దానితో తలకు మసాజ్ చేయండి. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టును తగ్గిస్తుంది.
Also Read: పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు.. ఇది వాడితే తెల్లగా మెరిసిపోతారు
4. బ్లాక్ టీ ఉపయోగించండి:
డికాషన్ ఉపయోగించడం ద్వారా మీ జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో 2 చెంచాల బ్లాక్ టీ, ఒక చెంచా ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు దానిని ఫిల్టర్ చేయండి. ఈ నీరు చల్లబడినప్పుడు జుట్టుకు అప్లై చేయండి. ఇది జుట్టును నల్లగా చేస్తుంది
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.