Cold Home Remedies: చలికాలంలో తరచుగా జలుబు, గొంతు నొప్పి సమస్యలు వస్తుంటాయి. చల్లని గాలులు , ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. వీటి వల్ల మాట్లాడటం, మింగడం కష్టం అవుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. శరీరంలో కఫం పెరిగినప్పుడు, గొంతులో నొప్పి, వాపు సాధారణ సమస్య. ఈ సమస్యను తొలగించడంలో ఉపయోగపడే హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, గొంతు నొప్పి తగ్గాలంటే ?
ఉప్పునీరు పుక్కిలించడం: జలుబు, గొంతు వాపు , నొప్పిని తగ్గించడానికి ఇది సులభమైన ,అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి . కరిగిన తర్వాత పుకిలించండి. ఈ నీటితో రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి. ఉప్పు గొంతు బాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గొంతు వాపును తగ్గిస్తుంది.
తేనె , అల్లం: తేనె , అల్లం రెండూ గొంతుకు చాలా మేలు చేస్తాయి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది గొంతు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ అల్లం రసం కలపి త్రాగండి. రోజుకు 2-3 సార్లు దీనిని తీసుకోండి.ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
పసుపు పాలు: పసుపులో క్రిమినాశక,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అర టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి. జలుబు, గొంతునొప్పిని తగ్గించడంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి.
నిమ్మ,తేనె: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తేనె గొంతును ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా గొంతు మంటను తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలపండి. దీనిని రోజుకు 2-3 సార్లు త్రాగాలి.
Also Read: వీటిని.. నానబెట్టకుండా తింటే చాలా డేంజర్ తెలుసా ?
ఆవిరి పీల్చడం: స్టీమ్ ఇన్‌హేలేషన్ జలుబు, గొంతు వాపు , నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయండి. మీ తలను టవల్‌తో కప్పి, ఆవిరిని పీల్చడానికి పాత్రపై వంచండి. 5-10 నిమిషాలు ఆవిరిని పీల్చుకోండి. ఇలా చేయడం వల్ల జులుబు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తులసి కషాయం:
తులసి ఆకులతో తయారు చేసిన కషాయం కూడా జలుబును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది జలుబు సమయంలో వచ్చే గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ కషాయం తయారు చేయడానికి ముందుగా 3-4 తులసి ఆకులను తీసుకోవాలి . తర్వాత గ్లాసు నీటిలో వీటిని వేసి కాస్త మరిగించి త్రాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు, గొంతు నొప్పి సమయంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.