BigTV English

Parenting Guides: పిల్లలను ఏసీ, కూలర్ల ముందు పడుకోబెట్టడం చాలా ప్రమాదం

Parenting Guides: పిల్లలను ఏసీ, కూలర్ల ముందు పడుకోబెట్టడం చాలా ప్రమాదం

Parenting Guides: ప్రతీ ఏటా ఎండలు అంతకు అంతకు పెరిగిపోతున్నాయి. దీంతో వేసవికాలం వస్తుందంటే చాలు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో ఏసీలు, కూలర్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎవరి ఇళ్లలో చూసినా ఏసీలు, కూలర్లు తప్పక ఉంటున్నాయి.


ఎండల వేడికి తట్టుకోలేక చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏసీలకు అలవాటు పడిపోతున్నారు. అయితే ఇలా ఏసీల కింద పెద్దలు పడుకుంటే ప్రమాదం ఉండదు కానీ, చిన్న పిల్లలను మాత్రం ఏసీలు, కూలర్ల కింద పడుకోబెట్టడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లలను ఏసీ, కూలర్ గాలులకు ఉంచవచ్చని చెబుతున్నారు. కానీ కొన్ని సార్లు ఏసీల కింద కూడా ఉంచడం వల్ల వారికి దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు గది ఉష్ణోగ్రతను తప్పక అనుసరించాలని చెబుతున్నారు. వేడి గదిలో పిల్లలను ఉంచడం వల్ల వారికి జ్వరం వంటి సమస్యలు ఎదురవుతాయట. అందువల్ల సాధారణ ఉష్ణోగ్రతలోనే పిల్లలను ఉంచాలని అంటున్నారు.


Also Read: పిల్లలకు గాడిద పాలు తాగిస్తున్నారా.. లేదా ? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

ఒకవేళ ఏసీ గది నుంచి వేరొక గదికి పిల్లలను మారిస్తే వారికి తప్పకుండా సమస్యలు వస్తాయట. పిల్లల శరీరం గది ఉష్ణోగ్రతకు సమానంగా ఉండాలంటే ముందుగా వారిని ఏసీ ఆఫ్ చేసి కాసేపు ఉంచాలి. అనంతరం పిల్లల శరీర ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు సమానం అయిన తర్వాత అప్పుడు వేరె గదిలోకి లేదా బయటకు తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే పిల్లలను చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచి ఒక్కసారిగా తక్కువ ఉష్ణోగ్రత వద్దకు తీసుకెళ్తే ప్రమాదంలో పడతారు. అందువల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఏసీ కింద పిల్లలను పడుకోబెడితే వారికి మరీ ఎక్కువ గాలి తగలకుండా ఉండేలా కవర్ చేసి ఉంచాలట. బిడ్డ వయస్సు నెల కంటే ఎక్కువ ఉంటే కవర్ చేయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. కానీ శిశువుగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటిస్తే మంచిది అని చెబుతున్నారు.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×