BigTV English

Burning Eyes: కళ్లు మండుతున్నాయా ? జాగ్రత్త, అస్సలు లైట్ తీసుకోవద్దు

Burning Eyes: కళ్లు మండుతున్నాయా ? జాగ్రత్త, అస్సలు లైట్ తీసుకోవద్దు

Burning Eyes: సర్వేంద్రియానాం నయనం ప్రధానం ప్రధానం అన్న సామెతను ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కళ్లతోనే మనం ప్రపంచాన్ని చూస్తాము. శరీరభాగాల్లో కళ్లు చాలా ముఖ్యమైనది. కొన్ని సార్లు కంటి సంబంధిత సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా నొప్పి లేదా కళ్లలో మంటగా అనిపించినప్పుడు
కారణాలు తెలుసుకోకుండా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తరుచుగా కళ్లు మండుతూ ఉంటే గనక డాక్టర్లను సంప్రదించాలి. లేకుంటే అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. అసలు కళ్ల మంటలు ఎందుకు వస్తాయి ? అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కళ్ల మంట, నొప్పిని కలిగించే 5 కారణాలు:

కళ్లలో నొప్పి, మంటగా ఉన్నప్పుడు చాలా మంది అంతగా పట్టించుకోరు. కానీ అలా చేయడం తెలివైన పని కాదు. దీని వెనుక కారణం మీకు తెలియకపోతే మీ సమస్య మరింత పెరుగుతుంది అని మీరు గమనించాలి. ఎక్కువగా స్క్రీన్‌లను చూడటం,దుమ్ము, కాలుష్యం వంటివి కళ్లు మండటానికి ప్రధాన కారణాలని భావించినప్పటికీ ఇతర కారణాలు కూడా కళ్ల మంటలను కలిగిస్తాయి.


కంటి ఇన్ఫెక్షన్:
కళ్ల మంటలు కంటి నొప్పి, చికాకు కలిగిస్తాయి . కండ్లకలక , యువెటిస్ వంటి సమస్యలు కళ్లలో ఎరుపు, నీరు, అస్పష్టతకు కారణమవుతాయి. కండ్లకలక సమస్య వచ్చినప్పుడు, కళ్ళు ఎర్రగా, వాచినట్లు కనిపిస్తాయి. యువెటిస్ వచ్చినప్పుడు, కంటి లోపల పొరలు ఉబ్బుతాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే, మీరు వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

గ్లాకోమా లేదా రెటీనా డిస్ట్రోఫీ:
కళ్ల మంటల వెనుక కారణం గ్లాకోమా లేదా రెటీనా డిస్ట్రోఫీ కావచ్చు. మీరు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, అస్పష్టమైన దృష్టి, కాంతి లేదా కంటి చూపులో ఏదైనా ఇతర మార్పులను ఎదుర్కుంటే గనక అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

అలెర్జీల కారణంగా:
అలర్జీ వల్ల కళ్లలో నొప్పితో పాటు చికాకు కూడా కలుగుతుంది. మన చుట్టూ ఉన్న దుమ్ము, పుప్పొడి లేదా ఇతర అలెర్జీ కారకాలు దీనికి కారణం కావచ్చు. అలెర్జీ ప్రతిచర్య కారణంగా కళ్ళు ఎర్రగా మారడంతో పాటు వాపుగా మారుతాయి. మీకు ఇలాంటి సమస్య ఉంటే, మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

డ్రై ఐస్ కారణాలు:
కళ్లలో తేమ లేకపోవడం అంటే కళ్లు పొడిబారడం వల్ల కూడా కళ్లలో చికాకు, నొప్పి వస్తుంది. దీని వెనుక కారణం ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ సిస్టమ్ లేదా ఎక్కువ కాలం డిజిటల్ పరికరాలను ఉపయోగించడం. డ్రై ఐస్ కోసం ఐ డ్రాప్స్ కూడా బాగా పనిచేస్తాయి.

Also Read: వీటితో.. ఎంతటి తలనొప్పి అయినా క్షణాల్లోనే మాయం

ఫోన్, కంప్యూటర్లు:
మనం కంప్యూటర్లు, మొబైల్‌లను ఎక్కువగా ఉపయోగించినప్పుడు, మన కళ్ళు చాలా పొడిగా మారుతాయి. దీని వలన కళ్ళ మంటలు , నొప్పితో పాటు కళ్లు మసకబారడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడాలి. బ్లూ లైట్ గ్లాసెస్ కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×