BigTV English

Cardamom Water: యాలకుల నీటితో ఈ సమస్యలన్నీ దూరం

Cardamom Water: యాలకుల నీటితో ఈ సమస్యలన్నీ దూరం

Cardamom Water: యాలకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. యాలకుల నీరు తాడడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా భోజనం తర్వాత యాలకులను తినడం వల్ల మౌత్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది.


యాలకుల నీరు జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాలకుల నీరు తాగడం వల్ల కడుపులో వేడి తగ్గుతుంది.

యాలకుల నీరు జీర్ణ సంబంధిత సమస్యలకు మాత్రమే కాదు. దీన్ని తాగడం వల్ల నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. యాలకుల నీరు  బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. యాలకుల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను.. దీన్ని తయారు చేసే విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


యాలకుల నీటి ప్రయోజనాలు:

కడుపు వేడిని తగ్గిస్తుంది: యాలకులు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని తగ్గిస్తుంది. యాలకుల నీటిని ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల కడుపులో వేడి తగ్గుతుంది.

నోటి దుర్వాసనను తొలగిస్తుంది: నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యాలకుల నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. యాలకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి. ఇది శ్వాసను తాజాగా ఉంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది: ఒత్తిడితో బాధపడేవారు యాలకుల నీటిని తాగితే, అది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, యాలకుల ఒత్తిడిని తగ్గించే గుణాలను కలిగి ఉన్నాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇమ్యూనిటీ బూస్టర్: యాలకుల శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో యాలకుల నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఏలకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

Also Read: అధిక రక్తపోటును తగ్గించే మసాలా దినుసులు ఇవే

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడే వారు యాలకుల నీటిని తాగాలి. నిజానికి, ఏలకులు జీవక్రియను పెంచుతాయి. అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడతాయి. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కూడా ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

యాలకుల నీటిని ఎలా తయారు చేయాలి ?
యాలకుల నీటిని తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా 2-3 యాలకులను తీసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. దీని తరువాత, ఒక గ్లాసు నీరు తీసుకుని, దానిలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత దానిని రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో త్రాగండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×