Chicken Wings: చికెన్ వింగ్స్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. దాన్ని తినాలంటే ప్రతిసారి రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు… చికెన్ వింగ్స్ గంటలో రెడీ అయిపోతాయి. ఇవి ఇంట్లో ఉన్న పిల్లలకు, పెద్దలకు కూడా ఇది బాగా నచ్చుతాయి. ఎలా చేయాలో తెలుసుకోండి.
చికెన్ వింగ్స్ రెసిపీకే కావలసిన పదార్థాలు
చికెన్ వింగ్స్ – అరకిలో
మైదాపిండి – అరకప్పు
కారం – ఒక స్పూను
మిరియాల పొడి – అర స్పూను
ఉల్లిపాయ పొడి – ఒక స్పూను
వెల్లుల్లి పొడి – ఒక స్పూను
నూనె – వేయించడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
బటర్ – రెండు స్పూన్లు
సోయాసాస్ – ఒక స్పూన్
బ్రౌన్ షుగర్ – మూడు స్పూన్లు
వెల్లుల్లి తురుము – ఒక స్పూను
అల్లం తురుము – ఒక స్పూను
తేనె – ఒక స్పూన్
పచ్చిమిర్చి – రెండు
ఎండుమిర్చి – రెండు
నువ్వులు – ఒక స్పూను
సోయాసాస్ – రెండు స్పూన్లు
Also Read: నాన్ వెజ్ బిర్యానీ బోర్ కొట్టిందా.. ఒక్కసారి ఈ ఆకు కూరతో బిర్యానీ ట్రై చేయండి.. అదిరిపోతుంది
చికెన్ వింగ్స్ రెసిపీ
1. చికెన్ వింగ్స్ ను తెచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా టిష్యూ పేపర్ మీద ఆరబెట్టాలి.
2. ఒక గిన్నెలో మైదా, కారం, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయల పొడి వేసి బాగా కలిపి చికెన్ వింగ్స్ ను కూడా వేయాలి.
3. ఆ మిశ్రమం చికెన్ వింగ్స్‌కు బాగా పట్టేలా ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. చికెన్ వింగ్స్ అందులో వేసి వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి.
6. ఇప్పుడు ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి చిన్న మంట పెట్టాలి.7. దానిలో బటర్ వేయాలి. ఆ బటర్ లో అల్లం వెల్లుల్లి తురుమును వేయాలి.
8. అలాగే సోయాసాస్, తేనే, బ్రౌన్ షుగర్ కూడా వేసి కలుపుకోవాలి.
9. సాస్ కొద్దిగా చిక్కగా అయ్యాక పెద్ద మంట పెట్టి ముందుగా వేయించి తీసుకున్న చికెన్ వింగ్స్ ను వేసి టాస్ చేసుకోవాలి.
10. చివర్లో ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి.
11. నువ్వులు గింజలను చల్లుకోవాలి. అంతే టేస్టీ చికెన్ వింగ్స్ రెడీ అయినట్టే. ఇది నోరూరించేలా ఉంటాయి.
12. ఇంట్లో పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతాయి
చికెన్ వింగ్స్ బయట ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉంది. అదే ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ధరకే ఇవి రెడీ అయిపోతాయి. ముందుగానే చికెన్ షాప్ వాడికి వింగ్స్ ను వేరుగా చేసి పెట్టమని ఆర్డర్ ఇచ్చుకోవాలి. లేదా ఆన్లైన్ చికెన్ మార్కెట్లలో కూడా చికెన్ వింగ్స్ సపరేట్ గా దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కున్నా సరిపోతుంది. టేస్టీ చికెన్ వింగ్స్ వండేసుకోవచ్చు.