EPAPER

Satyam Sundaram : థియేటర్లలోకి కొత్త వెర్షన్… కట్ చేసిన ఆ సీన్స్ కూడా చూడొచ్చు

Satyam Sundaram : థియేటర్లలోకి కొత్త వెర్షన్… కట్ చేసిన ఆ సీన్స్ కూడా చూడొచ్చు

Satyam Sundaram : తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’ థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సినిమా నుంచి ఇప్పటికే కట్ చేసిన సన్నివేశాలను యాడ్ చేసి, కొత్త వెర్షన్ ను థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. మరి ఈ ఎమోషనల్ రైడ్ కొత్త వెర్షన్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందా? లేదంటే ల్యాగ్ చేశారు అనే ఫీలింగ్ ను తెప్పిస్తుందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


థియేటర్లలోకి ‘సత్యం సుందరం’ కొత్త వెర్షన్

కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన తాజా ఎమోషనల్ రైడ్ ‘సత్యం సుందరం’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయింది. ‘దేవర’ లాంటి పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ తో ఢీ కొట్టినప్పటికీ ‘సత్యం సుందరం’ తెలుగు రాష్ట్రాలలో పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబడుతుండడం విశేషం. జస్ట్ మౌత్ టాక్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 40 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి మూడు రోజుల్లోనే 13 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టుగా టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంచితే మూవీ రెండు గంటల 57 నిమిషాల రన్ టైం తో యూ సర్టిఫికెట్ తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి వచ్చింది. సినిమాలో పలు కామెడీ సన్నివేశాలు, మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయి అని టాక్ నడుస్తోంది. బంధాలను, బంధుత్వాలను గుర్తు చేసుకునేలా ఉన్న ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ సాగదీశారు అనే మాట కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘సత్యం సుందరం’ మూవీ కొత్త వెర్షన్ థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్ కు ముందే దాదాపు 18 నిమిషాల పాటు ట్రిమ్ చేసిన సన్నివేశాలను ఈ కొత్త వెర్షన్ లో యాడ్ చేయబోతున్నారు. ఈ లేటెస్ట్ వెర్షన్ ను ఈరోజు నుంచే థియేటర్లలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి ఎమోషనల్ రైడ్ గా ఆకట్టుకుంటున్న ‘సత్యం సుందరం ‘ మూవీ కొత్త వెర్షన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


లడ్డూ వివాదం హెల్ప్ అయినట్టేనా?

‘సత్యం సుందరం’ మూవీ ఈవెంట్లో కార్తీక్ లడ్డు గురించి చేసిన కామెంట్స్ ఎంతటి వివాదాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా పవన్ కళ్యాణ్ దీని గురించి స్పందిస్తూ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కార్తీ తో పాటు ఆయన కుటుంబం మొత్తం అలాంటి కామెంట్స్ చేసినందుకు సారీ చెప్పారు. కార్తీ ఏమీ తప్పు చేయకపోయినా సారీ చెప్పడంతో ఆయన పట్ల తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రేమ పెరిగిందని చెప్పాలి. అనవసరంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని రాద్దాంతం చేశారు అంటూ భారీ ఎత్తున విమర్శలు వినిపించాయి. ఏదేమైనా కార్తీక్ మంచితనం, లడ్డు వివాదం ‘సత్యం సుందరం’ మూవీ హిట్ అవ్వడానికి ఎంతో కొంత కారణమైంది.

Related News

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Vettaiyan: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

Shobitha Dulipala : అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను… అక్కినేని కోడలు బయటపెట్టిన నిజం..

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్

Vettaiyan Movie Review : వెట్టయాన్ మూవీ రివ్యూ… రజినీకాంత్‌కి ఇది సరిపోయిందా…?

Nayanatara: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?

×