Coconut Oil Benefits: కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనె తరచుగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడతాయి. కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాకుండా ఎండ, కాలుష్యం నుండి రక్షించబడుతుంది. కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
మేకప్ తొలగించడానికి కొబ్బరి నూనెను వాడటం చాలా మంచిది. కొబ్బరి నూనెలో చర్మానికి లోతుగా చొచ్చుకుపోయే గుణాలు ఉంటాయి. తద్వారా చర్మం కోమలంగా తయారవుతుంది. కోల్పోయిన రంగు కూడా తిరిగి వస్తుంది.
మాయిశ్చరైజర్‌గా ఉపయోగించండి:
కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా రాత్రిపూట మీ ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా ముఖాన్ని మసాజ్ చేయాలి. రాత్రంతా చర్మంపై నూనెను అలాగే ఉంచి ఉదయం గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది మీ ముఖాన్ని తేమగా మారుస్తుంది. అంతే కాకుండా కాంతివంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
స్క్రబ్:
కొబ్బరి నూనెను స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం 1 టీ స్పూన్ కొబ్బరి నూనెలో 1 టీ స్పూన్ చక్కెర లేదా కాఫీ పౌడర్ కలిపి మిక్స్ చేయండి. తర్వాత దీనిని ముఖానికి నెమ్మదిగా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఈ స్క్రబ్ ముఖంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా మృదువుగా కూడా తయారు చేస్తుంది. తరచుగా ఈ స్క్రబ్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ముఖం తెల్లగా మెరిసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా కూడా నివారిస్తుంది.
ఫేస్ మాస్క్ గా ఉపయోగించండి:
కొబ్బరి నూనెను ఫేస్ మాస్కుగా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో కొంచెం పసుపు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో వాష్ చేయండి. ఈ మాస్క్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె చర్మంపై సూర్యకాంతి యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించడానికి ముందు కొద్దిగా చికాకు ఉన్న ప్రదేశాలలో నూనెను పూయండి. తర్వాత మసాజ్ చేయండి. ఒకటి లేదా రెండు రోజుల్లో మీరు దాని ప్రభావాన్ని తప్పకుండా చూస్తారు.
Also Read: ఫర్ఫ్యూమ్ వాడితే క్యాన్సర్ ! ఎందుకో తెలుసా ?
కొబ్బరి నూనె వాడకం చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఇది చర్మానికి హాని కలిగిస్తుందని గుర్తుంచుకోండి . మీ చర్మం చాలా జిడ్డుగా ఉంటే లేదా మీకు మొటిమల సమస్య ఉంటే, కొబ్బరి నూనెను తక్కువ మోతాదులో వాడాలని గుర్తుంచుకోండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు.