Perfume: ప్రస్తుతం చాలా మంది ఫర్ఫ్యూమ్స్ వాడటం చూస్తుంటాం. చెమట వాసనను దాచడానికి తరచుగా పెర్ఫ్యూమ్, బాడీ స్ప్రే లను ఉపయోగిస్తారు. ఫర్ఫ్యూమ్స్ వాడటం వల్ల రోజంతా శరీరంపై మంచి సువాసన ఉంటుంది. అంతే కాకుండా తాజాగా కూడా అనిపిస్తుంది. కానీ వీటిలో వాడే కొన్ని రకాల రసాయన పదార్థాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. వీటి వల్ల తలనొప్పి, అలెర్జీ, తామరతో పాటు అనేక సమస్యలు వస్తాయి. ఎక్కువగా ఫర్ఫ్యూమ్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఫర్ఫ్యూమ్ వాడటం మంచిదా ? కాదా ? ఒక వేళ వాడితే, ఎలాంటి ఫర్ఫ్యూమ్స్ వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫర్ఫ్యూమ్స్‌లో ఏ రసాయనాలను ఉపయోగిస్తారు ?
అసిటోన్, ఫార్మాల్డిహైడ్ వంటి అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కలిగించే ఆల్కహాల్ కూడా వాడతారు. వీటిలో వాడే ఇథనాల్ ఆల్కహాల్ సువాసనను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది.
నిజానికి సహజమైన కొలోన్ గులాబీలు, మల్లె మొదలైన పూల నుండి తయారవుతుంది. ఇందులో ఎలాంటి రసాయనాలు కలపరు. కానీ ఫర్ఫ్యూమ్ లలో సహజ పదార్థాలతో పాటు ఆల్కహాల్, ఇతర రసాయనాలు కలుపుతారు.
ఫర్ఫ్యూమ్ నేరుగా చర్మానికి వాడొచ్చా ?
ఫర్ఫ్యూమ్ నేరుగా చర్మానికి వాడొచ్చు. సహజ పదార్థాలతో తయారు చేసిన ఫర్ఫ్యూమ్ ఎటువంటి హాని కలిగించదు. గులాబీ, మల్లె వంటి పూలతో తయారు చేసిన ఫర్ఫ్యూమ్ వాసనలు నచ్చకపోతే తలనొప్పి, నిరంతరం తుమ్ముల వంటివి వస్తాయి.
ఎక్కువగా ఫర్ఫ్యూమ్ వాడితే ఏం జరుగుతుంది ?
ఫర్ఫ్యూమ్ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది చర్మ అలర్జీలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఫర్ఫ్యూమ్ కొనేటప్పడు ఈ జాగ్రత్తలు తీసుకోండి :
ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ఫర్ఫ్యూమ్ సరిపోతుంది అని చెప్పలేము. అందుకే ఫర్ఫ్యూమ్ కొనేటప్పుడు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలి.
1. ఫర్ఫ్యూమ్ వాసనను చూడటానికి ముందుగా మీ చేతికి పూయండి. తర్వాత 10 నిమిషాల పాటు ఎలాంటి దురద లేదా చికాకు అనిపించకపోతే ఆ ఫర్ఫ్యూమ్ మీకు సురక్షితం అయిందని గుర్తించండి.
2. ఫర్ఫ్యూమ్ చర్మానికి అప్లై చేసిన వెంటనే చర్మంపై చికాకు కలిగితే దానిని అస్సలు కొనకండి.
3. ఫర్ఫ్యూమ్ బాటిల్ పై ఆల్కహాల్ కంటెంట్ పరిశీలించండి. అధికంగా ఫర్ఫ్యూమ్ లో ఆల్కహాల్ ఉంటే అది దురద, దద్దుర్ల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. 70 శాతం లోపు ఆల్కహాల్ ఉన్న ఫర్ఫ్యూమ్ వాడటం మంచిది.
Also Read: జుట్టుకు హెన్నా, హెయిర్ డైలను వాడుతున్నారా ?
ఫర్ఫ్యూమ్‌లో హానికర పదార్థాలు ఉన్నాయని ఎలా గుర్తించాలి ?
ఫర్ఫ్యూమ్ కొనే ముందు వాటి లెబుల్ చదివి ఎలాంటి రసాయనాలు వాడారో గమనించండి. శరీరంలోని కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. మీరు వాటికి పెర్ఫ్యూమ్ పూయడం మానుకోవాలి. కళ్లు, బుగ్గలు, గాయాలు, అండర్ ఆర్మ్ లో శరీరంలోని కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. మీరు వీటికి పెర్ఫ్యూమ్ మానుకోవాలి.