Big Stories

Health Tips: ఇమ్యూనిటీని పెంచి..రోగాలను దూరం చేసే ఆహారాలు ఇవే..

Foods That Support For Immunity System: మారుతున్న సీజన్లకు అనుగుణంగా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు..ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. రోజు తినే ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలు, బాదం వంటివి చేర్చడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంత గానో ఉపయోగపడతాయి.

- Advertisement -

సిట్రస్ పండ్లు: నిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సిట్రస్ పండ్లు తింటే శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అంతే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిచడంతో పాటు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో విటమిన్ సి పెరుగుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

- Advertisement -

వెల్లుల్లి: వెల్లుల్లిని ఔషధాల తయారీలోనూ వాడతారు. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను వెల్లుల్లి కలిగి ఉంటుంది. దీనిలో అల్లిసిన్‌ ఉంటుంది. దీన్ని ఆహార పదార్థాల తయారీలో వాడడం వల్ల రుచి పెరగడమే కాకుండా సూక్ష్మజీవులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. ఆరోగ్యంతో పాటు రుచి కోసం కూరలు, సాస్‌ లు, వేపుళ్ళలో వెల్లుల్లిని వాడండి.

Also Read:బ్లాక్ సాల్ట్ తో బెనిఫిట్స్ ఎన్నో..

ఆకుకూరలు: పుదీనా, బచ్చలికూర, మునగ ఆకులు, ఉసిరి ఆకులతో పాటు ఇతర ఆకుకూరలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఎ,సి, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని గ్రేవీలు, పప్పులు, సలాడ్‌ లల్లో చేర్చడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.

బాదం పప్పులు: బాదం పప్పులులో విటమిన్ ఇ, జింక్, ఫోలేట్, ఐరన్ ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ కొద్దిపాటి అల్పాహారం తీసుకోవాలి. అందులో భాగంగా రోజు బాదంను చేర్చుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News